ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఅవార్డులు ఉద్యోగులకు ప్రేరణనిస్తాయి -శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా

అవార్డులు ఉద్యోగులకు ప్రేరణనిస్తాయి -శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026: అవార్డులు ఉద్యోగులకు మరింత ప్రేరణనిస్తాయని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న కంచిరావుపల్లి జడ్పీ హైస్కూల్ ఆంగ్ల భాషోపాధ్యాయుడు వంగూరు నారాయణరెడ్డిని సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ… వృత్తి ధర్మాన్ని చిత్త శుద్ధితో నిర్వహిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించడం అభినందనీయం అన్నారు.అలా ఆంగ్ల భాషలో విద్యార్థుల రాణింపు కోసం అంకిత భావంతో పనిచేస్తున్న వంగూరు నారాయణరెడ్డికి అవార్డు రావడం ఆనందించదగ్గ విషయంగా భావించడం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి,అనురాధ,రాజేష్ బాబు, రాజు, బైరోజు చంద్ర శేఖర్, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, శేఖర్, ఫాతిమా, ఈశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!