దొడ్డిదారిన నిధుల మళ్లింపు… సమాధానం చెప్పని అధికారులు
రికార్డులు తారుమారు పేద మహిళ పొట్టకొట్టి
రూపాయి రూపాయి కూడబెట్టి కడితే నిధులు వేరే ఖాతాలకు మళ్లించారా – బాధితులు చాకలి పద్మ ఆవేదన హెచ్చరిక

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026: “కూలి నాలి చేసుకునే మాలాంటి పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే, ఆ సంతోషం కూడా లేకుండా అధికారులు మా పొట్టకొట్టారు. ఉన్న ఊళ్లో అప్పుసప్పు చేసి, రూపాయి రూపాయి కూడబెట్టి బేస్మెంట్ నిర్మాణం పూర్తి చేశాం. కానీ, మాకు రావలసిన ప్రభుత్వ నిధులను అధికారులు కుమ్మక్కై పక్కదారి మళ్లించి నొక్కేశారు” అని తీర్మలాయపల్లి గ్రామానికి చెందిన బాధితురాలు చాకలి పద్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం వనపర్తి జిల్లా మదనాపురం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో కలిసి అధికారులను నిలదీసి, ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ… బేస్మెంట్ పూర్తయిన తర్వాత రావాల్సిన నిధులను చాకలి పద్మ ఖాతాలో వేయకుండా, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి మరియు క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శించి ఇతర ఖాతాలకు మళ్లించారని ఆందోళన వ్యక్తం చేశారు.నిధులు ఎవరి ఖాతాలోకి వెళ్లాయని ప్రశ్నిస్తే.. అధికారులు నీళ్లు నములుతు మౌనంగా ఉంటూ తప్ప స్పష్టమైన సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు.“ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది.ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది.ఆ నమ్మకంతో చాకలి పద్మ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులు ఖర్చు చేసి బేస్మెంట్ నిర్మించుకున్నాం. కానీ మాకు రావాల్సిన ప్రభుత్వ నిధులు మాత్రం ఇప్పటివరకు అందలేదని కోరారు.మా డబ్బులు ఎక్కడికి వెళ్లాయో అధికారులు చెప్పడం లేదు. మాకు రావాల్సిన నిధులను పక్కదారి మళ్లించి నొక్కేశారని,కుటుంబానికి న్యాయం చేయాలి” అని తీర్మలాయపల్లి గ్రామానికి చెందిన చాకలి పద్మ ఆవేదన వ్యక్తం చేసింది. బేస్మెంట్ కి వచ్చిన నిధులను తక్షణమే అందజేయాలని లేనిపక్షంలో న్యాయం కోసం కుల సంఘాల ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.


