ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిపోలీసు పెట్రోల్ బంక్‌కు ఏడాది పూర్తి కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించినజిల్లాఎస్పీ

పోలీసు పెట్రోల్ బంక్‌కు ఏడాది పూర్తి కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించినజిల్లాఎస్పీ

📰 Generate e-Paper Clip

– నాణ్యత, పరిమాణంలో రాజీ లేకుండా ప్రజలకు నిరంతర సేవలు, 24 గంటలు నాణ్యమైనపెట్రోల్,డీజిల్.అందుబాటులో పోలీసుపెట్రోల్.బంక్,తొలివార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన ఎస్పీ.సునిత రెడ్డి,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ సెప్టెంబర్.09.2026.పెట్రోల్,డీజిల్.నాణ్యతపరిమాణంలో ఎలాంటి రాజీ లేకుండా వినియోగదారులకు పారదర్శకమైన సేవలు అందించడమే పోలీసుపెట్రోల్ బంక్ ప్రధాన లక్ష్యమని ఎస్పీ. సునిత రెడ్డి  తెలిపారు. నాణ్యమైన ఇంధనం వినియోగించడంవల్లవాహనాల ఇంజిన్.సామర్థ్యంమెరుగుపడి,తరచూరిపేర్లకుగురికాకుండానిర్వహణఖర్చులుతగ్గుతాయన్నారు.మంగళవారం వనపర్తి–కొత్తకోట ప్రధాన రహదారిపై రాజపేట గ్రామశివారులోనిగాయత్రిపాలిటెక్నిక్,కళాశాలసమీపంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీసుపెట్రోల్.బంక్,విజయవంతంగాఒకసంవత్సరం పూర్తిచేసుకున్నసందర్భంగాతొలివార్షికోత్సవవేడుకలను జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసివార్షికోత్సవవేడుకలను ఘనంగానిర్వహించారు.ఈసందర్భంగాఎస్పీ.మాట్లాడుతూ పోలీసు పెట్రోల్ బంక్‌ను ఏర్పాటుచేయడంలో ప్రధాన ఉద్దేశం ప్రజలకు నాణ్యమైన ఇంధనాన్ని, సరైన పరిమాణంలో,పారదర్శకంగాఅందించడమేనని ఏడాది కాలంగా ప్రజలకు నిరంతరాయంగా సేవలు అందిస్తూ వారి విశ్వాసాన్ని పొందడం సంతోషంగా ఉందని పెట్రోల్, డీజిల్ నాణ్యత పరిమాణంలో ఎలాంటి రాజీ లేకుండా వినియోగదారులకు సేవలు అందిస్తూకల్తీలేనినాణ్యమైనఇంధనంవినియోగించడం వల్ల వాహనాల ఇంజిన్ పనితీరు మెరుగుపడి, తరచూ రిపేర్లు తగ్గడంతో పాటు నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని పోలీసు పెట్రోల్ బంక్‌లో 24 గంటలూ పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటుందని, వాహనదారులు, రైతులు, ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగంచేసుకోవాలనిపోలీసుశాఖశాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకుఉపయోగపడేసేవలను అందించడంలోనూముందుండాలని.ప్రజలఅవసరాలను గుర్తించి వారికి నేరుగా ఉపయోగపడే సేవలను అందించడం ద్వారా పోలీసు శాఖపై ప్రజల్లో మరింత విశ్వాసం, నమ్మకం పెంపొందుతుందని తెలిపారు. పోలీసు పెట్రోల్ బంక్ సేవలను భవిష్యత్తులో కూడా అదేనాణ్యత,నిజాయితీ,పారదర్శకతతోకొనసాగించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే పోలీసు శాఖకు అత్యంత ముఖ్యమని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఎస్పీ.తెలిపారు.అనంతరం పోలీస్ పెట్రోల్ బంక్ లో 24 గంటలు మంచిగా పని చేస్తున్న బాయ్స్ కు ఎస్పీ  నగదురివార్డుఅందజేశారు.ఈకార్యక్రమంలో ఏఆర్.అదనపుఎస్పీ.వీరారెడ్డి,వనపర్తిడిఎస్పీ,గిరిబాబు, డిసిఆర్బి డిఎస్పి, బాలాజీ నాయక్, కొత్తకోట సీఐ ఓడి, రమేష్, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, వనపర్తి రూరల్ ఎస్సై హృషికేష్, శ్రీరంగాపూర్ ఎస్సై, హిమబిందు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, వినోద్, మగ్దుం భారీ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!