ePaper
Thursday, September 10, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మందమ్మపేట మండలంలో బిఆర్ఎస్ నేత సోయం పర్యటన

దమ్మపేట మండలంలో బిఆర్ఎస్ నేత సోయం పర్యటన

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 9:దమ్మపేట మండలంలో పలు కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం పాల్గొన్నారు.మండలంలోని గొర్రెగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అదే దేవస్థానంలో కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కీసరి శ్రీను – నాగమణి దంపతుల కుమార్తె వెంకటలక్ష్మి – కిరణ్ ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వెంట సోయం లక్ష్మీ తిరుపతమ్మ కూడా ఉన్నారు.అనంతరం మండలపల్లి గ్రామానికి చెందిన ధారా రంగారావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకుని వారి నివాసానికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ సున్నం లలిత, మాజీ సర్పంచ్ చేపా రాఘవయ్య, వూకే బుల్లిబాబు, పాయం సూర్యం, గుండె సూర్యం, కోర్సా వెంకటేశ్, పాకనాటి శ్రీను, కనపర్తి ధర్మారావు, సోయం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!