-బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వీవీ గౌడ్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026: పెబ్బేరు పట్టణ పరిధిలోని సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వనపర్తి బాలుర వసతి గృహంలో బియ్యం అక్రమ తరలింపు ఆరోపణలపై వార్డెన్ సస్పెన్షన్ ను ఆయన స్వాగతించారు. పేద బీసీ విద్యార్థులకు అందాల్సిన ఆహారాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పెబ్బేరు తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, బియ్యం స్టాక్ రిజిస్టర్లు బహిర్గతం చేయాలని ఆయన కోరారు. చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్, బీసీ సంక్షేమ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అవినీతికి పాల్పడే వారిపై ఇదే విధంగా చర్యలు కొనసాగాలని అన్నారు.

