ePaper
Thursday, September 10, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం. పెద్దమందడి జూనియర్ కళాశాల!

ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం. పెద్దమందడి జూనియర్ కళాశాల!

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026: పుట్టుక నీది, చావు నీది బ్రతుకంతా దేశానిది అని చాటి చెప్పిన మహనీయుడు కాళోజీ నారాయణ రావు అని పెద్దమందడి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి. సైదులు పేర్కొన్నారు. మంగళవారం రోజు కాళోజీ నారాయణ జయంతి సందర్భంగా కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… కాళోజీ నారాయణ రావు పూర్తి పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాస రాoరాజ కాళోజీ నారాయణ రావు అని, అతను కర్ణాటక రాష్ట్రంలో జన్మించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోనీ వరంగల్ జిల్లా మడికొండలో స్థిరపడి తెలంగాణ రాష్ట్ర భాషా ఏ విధంగా వివక్షతకు గురవుతున్నది అనేది తన రచనల ద్వారా తెలంగాణ సమాజానికి వివరించాడు. ఆ విధంగా తాను చేసిన సేవకు ప్రతిఫలంగా భారత ప్రభుత్వం దేశ రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిందన్నారు. ఆఖరికి తాను చనిపోతూ కూడా తన దేహాన్ని తెలంగాణ ప్రాంత మెడికల్ కాలేజీ అయిన కాకతీయ మెడికల్ కాలేజ్ కి దానం చేస్తూ 2002 లో తుది శ్వాస విడిచారు. ఆయన జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సెప్టెంబర్ 9 వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవం గా జరుపుకోవడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, తిరుపతయ్య, చెన్నకేశవులు, మహేందర్, రఘు, నరసింహ స్వామి, సురేష్, సతీష్, అధ్యాపకేతర సిబ్బంది శ్రీనివాస్ , రహీం, మంజులత, పారిజాతమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!