ePaper
Friday, September 11, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఆత్మహత్యలు పరిష్కారం కాదు.. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది - పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాల...

ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది – పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి సైదులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026: పెద్దమందడిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెప్టెంబర్ 10న ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం, అవగాహన పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జి. సైదులు (ఎం.ఎస్సీ., బి.ఎడ్.) మాట్లాడుతూ… జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు తప్పకుండా పరిష్కారం ఉంటుందని, ఏ సమస్య కూడా జీవితం కంటే పెద్దది కాదని విద్యార్థులకు సూచించారు. ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదని, ఒక విలువైన జీవితాన్ని ముగించడంతో పాటు కుటుంబ సభ్యుల ఆశలు, కలలను కూడా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. బాధ తాత్కాలికమైనదని, జీవితం అత్యంత విలువైనదని తెలిపారు. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నిరాశకు లోనుకాకుండా ఆశతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని మనసులో దాచుకోకుండా అధ్యాపకులు, తల్లిదండ్రులు, స్నేహితులు లేదా శ్రేయోభిలాషులతో పంచుకోవాలని చెప్పారు. మనపై మనకు నమ్మకం ఉంచుకుంటే క్లిష్ట పరిస్థితులను కూడా అధిగమించగలమని తెలిపారు. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. విద్యార్థులు తమతో పాటు తోటి విద్యార్థుల్లోనూ మానసిక ధైర్యాన్ని పెంపొందించేలా సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!