మట్టి వినాయకుల తయారీ (వర్క్ షాప్)
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
చిన్నారులలోని చిత్ర కళా నైపుణ్యాలను వెలికి తీసే దిశగా నాలుగు సంవత్సరాలుగా కళకు అంకితం అయి, చిత్ర కళకు సేవ చేస్తూ, ఎందరో చిన్నారులకు మెళకువలు నేర్పిస్తూ, శిక్షణ అందిస్తున్న సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ హనుమకొండ ఈ సారి పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మట్టి వినాయకుల తయారీలో వర్క్ షాప్ నిర్వహించబోతుందని .5 సంవత్సరాలు పైబడిన వారు పాల్గొనవచ్చని.. వినాయకుని తయారీకి మట్టి సమకురుస్తామని ..పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు అందిస్తామని అకాడమీ డైరెక్టర్ డా. మంజుల సాగంటి ఒక ప్రకటనలో తెలిపారు.మట్టి విగ్రహాల తయారీ వల్ల ప్రకృతికి హాని లేకుండా భవిషత్తులో కొంతలో కొంతైనా మార్పు వస్తుందని పిల్లల్లో ఈ ధోరణి అలవాటు చేయాలనీ ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.గత సంవత్సరం కూడా మట్టి వినాయకుల తయారీ, మట్టి దుర్గా మాత విగ్రహాల తయారీ వర్క్ షాప్ లు నిర్వహించామని… చాలా మంది పిల్లలు పెద్దలు పాల్గొన్నారని… ఇలా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ సామాజిక మార్పు కోసం పాటు పడతామని తెలిపారు… పిల్లల్లో ఈ ధోరణి అలవాటు చేసేలా తల్లిదండ్రులు, పెద్దలు ప్రోత్సాహించా లని కోరారు… వారిలోని శిల్పకళ నైపుణ్యాన్ని ఈ రకంగా కూడా పెంచవచ్చని తెలిపారు…

