ePaper
Friday, September 11, 2026
📄 ePaper
Homeతెలంగాణశాసనమండలిలో తీన్మార్ మల్లన్నతో పాదయాత్రపై చర్చ

శాసనమండలిలో తీన్మార్ మల్లన్నతో పాదయాత్రపై చర్చ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 11 2026: హైదరాబాద్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను శుక్రవారం శాసనమండలిలో పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చేపట్టనున్న పాదయాత్రకు సంబంధించిన అంశాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. పాదయాత్ర లక్ష్యాలు, నిర్వహణ, ప్రజల్లోకి పార్టీ విధానాలను తీసుకెళ్లే విధానం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు నాయకులు తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో మరింతగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షులు విజయ్ యాదవ్, బెంగళూరు బాలు యాదవ్, నరేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!