ePaper
Saturday, September 12, 2026
📄 ePaper

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలముందుఇచ్చినహామీలను విస్మరించి రైతులను ప్రజలను మోసం చేస్తోంది

📰 Generate e-Paper Clip

– మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.13. 2026.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి రైతులను, ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని మహబూబ్‌నగర్‌ ఎంపీ. డీకే. అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని  చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్షలో ముఖ్యఅతిథిగాపాల్గొని ఎంపీ డీకే. అరుణ మాట్లాడుతుకాంగ్రెస్.ప్రభుత్వంవెయ్యిరోజులపాలనపూర్తయిందనిసంబరాలుచేసుకుంటోందని,అయితేఈవెయ్యిరోజుల్లోరైతులకు,సామాన్యప్రజలకుచేసిందేమిటో చెప్పాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం పై డిమాండ్‌ చేశారు.ఎన్నికలసమయంలోహామీలవర్షంకురిపించిన కాంగ్రెస్‌ నేతలు, అధికారంలోకివచ్చినతర్వాతవాటిని అమలుచేయకుండాకాలయాపనచేస్తున్నారనివిమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీని అర్హులైన ప్రతి రైతుకు అమలు చేయకుండా కొందరికే పరిమితంచేసి చేతులు దులుపుకున్నారని అన్నారు.రైతు భరోసా సకాలంలో అందక, పంటలకు అవసరమైన విద్యుత్‌ సరఫరాలేకఅన్నదాతలుతీవ్రఇబ్బందులుపడుతున్నారని అన్నారు. కొడంగల్‌కు విద్యుత్‌ సరఫరా చేస్తూ, ఇతరప్రాంతాలరైతులకుఎందుకుకోతలువిధిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌, కనీసం సాగునీటి అవసరాలకుసరిపడావిద్యుత్‌,అందించలేకపోతోందని ఎద్దేవాచేశారు.నకిలీవిత్తనాలవిక్రయాలనుఅరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నకిలీవిత్తనాలతోనష్టపోతున్నరైతులకన్నీళ్లుప్రభుత్వానికికనిపించడంలేదానిప్రశ్నించారు.పంటలకుగిట్టుబాటుధరకల్పించడంలోనూకాంగ్రెస్‌,ప్రభుత్వంనిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.రైతులసమస్యలనుపరిష్కరించాల్సిన ప్రభుత్వం రాజకీయ ప్రచారాలు, సంబరాలకే పరిమితమైందనిమండిపడ్డారు.రాష్ట్రంలోమహిళలకుఉచితబస్సుప్రయాణంకల్పిస్తామనిహామీఇచ్చినప్పటికీ, అనేక గ్రామాలకు బస్సులు సక్రమంగా నడవడం లేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండామాటలతోమభ్యపెట్టడంకాంగ్రెస్‌,ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు. గతంలోకేసీఆర్‌,మాటలుఎక్కువగాచెప్పారని,ఇప్పుడురేవంత్‌రెడ్డి,అంతకుమించిమాటలకేపరిమితమవుతున్నారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. ప్రధానినరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంరైతులసంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి, గిట్టుబాటు ధరల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.రైతులసమస్యలపై బీజేపీ నిరంతరం పోరాడుతుందని,కాంగ్రెస్‌,ప్రభుత్వం తనహామీలనునెరవేర్చేవరకుప్రజలపక్షానఉద్యమాలు కొనసాగిస్తామని డీకే అరుణ స్పష్టం చేశారు. ఈ రైతు దీక్షలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగానినాదాలు చేశారు. అనంతరం రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటుచేసిన ఐమాక్స్ లైట్లను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కిషన్ మోర్చా అధ్యక్షులు నంది నరసయ్య, జాతీయ కోఆప్షన్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, అయ్యవారి ప్రభాకర్ రెడ్డి, కొండ ప్రశాంత్ రెడ్డి కొమ్ము భరత్ భూషణ్, రాజ వర్ధన్ రెడ్డి, దాబా శీను నరేంద్ర గౌడ్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుల పంపిణీ అభినందనీయం: ఏనుగు సుదర్శన్ రెడ్డి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

భారత్‌లో మొట్టమొదటి “కులం లేదు.. మతం లేదు” సర్టిఫికెట్ పొందిన అడ్వకేట్...

భారత్‌లో మొట్టమొదటి “కులం లేదు.. మతం లేదు” సర్టిఫికెట్ పొందిన అడ్వకేట్...

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

 – వనపర్తి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో,పొలిటికల్...

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయండి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,–  కొత్తకోట...

వాటర్ మ్యాన్ కాదు బటర్ మ్యాన్ కూటమి ప్రభుత్వం పై తోలేటి శ్రీకాంత్ ఫైర్

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్...

Related Articles

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుల పంపిణీ అభినందనీయం: ఏనుగు సుదర్శన్ రెడ్డి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.              మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి...

భారత్‌లో మొట్టమొదటి “కులం లేదు.. మతం లేదు” సర్టిఫికెట్ పొందిన అడ్వకేట్ స్నేహ!పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్...

భారత్‌లో మొట్టమొదటి “కులం లేదు.. మతం లేదు” సర్టిఫికెట్ పొందిన అడ్వకేట్ స్నేహ!పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్...
error: Content is protected !!