ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper

చికరుచెట్టు తండా అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహారంపై అవగాహన

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 22 2026: పెద్దమందడి మండలంలోని చికరుచెట్టు తండా అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మహిళా మోర్చా పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కేంద్రం ద్వారా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ అవుతోందా అనే అంశాలను పరిశీలించారు. అంగన్‌వాడీ టీచర్ చిట్టేమ్మ ఆధ్వర్యంలో కేంద్రంలోని చిన్నారులు, తల్లులకు అందుతున్న పౌష్టికాహారం, దాని వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, కార్యక్రమ కన్వీనర్, గ్రామ సర్పంచ్ లలిత కిషన్ నాయక్ ఆధ్వర్యం వహించారు. కార్యక్రమంలో వక్తగా పాల్గొన్న వనపర్తి జిల్లా బీజేపీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు అశ్విని రాధ మాట్లాడుతూ… చిన్నారులు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం అందించడం అత్యంత ముఖ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ సక్షం అంగన్‌వాడీ అండ్ పోషణ్ 2.0 ద్వారా అర్హులైన చిన్నారులు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారంతో పాటు ఆరోగ్యం, పోషకాహార అవగాహన తదితర సేవలు అందుతున్నాయని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఎదుగుదల, ఆరోగ్యం, పోషక స్థితిని పర్యవేక్షించడం, అవసరమైన వారికి సంబంధిత ఆరోగ్య సేవలకు రిఫర్ చేయడం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పౌష్టికాహారం అర్హులైన ప్రతి ఒక్కరికీ సక్రమంగా అందేలా సంబంధిత సిబ్బంది, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామస్థులు, మహిళలు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

*హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు 24 గంటలు బంద్* ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్...

ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్.. ఎస్ఐ మృతి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

దళిత భూములను భూకబ్జా చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలి.

 కాశినాయన సెప్టెంబర్ 22 పొలిటికల్ పవర్ పి యన్ 9టీవీ సమగ్ర...

నాగిశెట్టిపల్లె రెవెన్యూ పొలంలో పంట కాలువ పూడ్చివేతపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

సర్వే నంబర్ 423లో దొంగ రికార్డులు సృష్టించి ఆక్రమణలకు పాల్పడిన వారిపై...

లింగారెడ్డి పల్లె ఎస్డబ్ల్యుపిసి కేంద్రం నందు వానపాములు విడుదల

 ... కలసపాడు సెప్టెంబర్ 22 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలను జయప్రదం చేయండి

ప్రముఖ వచన కవి మర్రికంటి నరసింహ కు గుర్రం జాషువ సాహిత్య...

Related Articles

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా జేఏసీ ఉమ్మడి వేదిక.

అన్ని జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా జేఏసీ పనిచేస్తుంది. యూనియన్ భేదాలు పక్కనపెట్టి జర్నలిస్టుల సమస్యలపై సమిష్టి పోరాటం. జర్నలిస్టుల హక్కుల కోసం ఒక్కటవుదాం.. జేఏసీతో కలిసి నడుద్దాం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే జేఏసీ ప్రధాన లక్ష్యం. -వనపర్తి జిల్లా...

కనిమెట్ట గ్రామంలో వితంతు, వికలాంగుల పింఛన్ల వెరిఫికేషన్

ప్రతి దరఖాస్తుదారుడి ఇంటి వద్దే పరిశీలనపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23 2026: కొత్తకోట మండలం కనిమెట్ట...

ప్రతి దరఖాస్తుదారుడి ఇంటి వద్దే పరిశీలనపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23 2026: కొత్తకోట మండలం కనిమెట్ట...
error: Content is protected !!