ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper

*నిమ్స్‌ వైద్యుడి ఆస్తులు 80 కోట్లు..

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

 

– కండ్లు చెదిరేలా అక్రమాస్తుల చిట్టా వెలుగులోకి..!*

*హైదరాబాద్‌, ‘లక్కీ భాస్కర్‌’ సినిమా తరహాలో నిమ్స్‌ అడిషనల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీభాస్కర్‌ భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు. సినిమా కథనే తలదన్నేలా ప్రైవేట్‌ సంస్థల్లో లక్షల రూపాయల పెట్టుబడులు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో లక్షల ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఖరీదైన కార్లు, కోటిన్నర వరకు వడ్డీలకు తిప్పుతూ.. కళ్లు చెదిరే ఫ్లాట్లలో తన అక్రమాస్తుల సామ్రాజ్యాన్ని విస్తరించారు.*

*వివాదాస్పదుడిగా పేరుగాంచడం, అక్రమంగా డబ్బులు సంపాదిస్తుండటంతో ఏసీబీ అధికారులు ఆయనపై దృష్టిపెట్టి కూపీలాగారు. ప్రాథమిక పరిశీలనలోనే భారీగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం తెల్లవారుజాము నుంచే ఎర్రగడ్డలోని కల్పతరువు అపార్ట్‌మెంట్స్‌లో ఆయన నివాసంతోపాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సన్నిహితులకు సంబంధించిన 7 ప్రదేశాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. అవినీతి, అక్రమాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు.*

*రూ.80 కోట్లకు పైగానే అక్రమాస్తులు..*

ఏసీబీ అధికారులు గుర్తించిన స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.6.13 కోట్లుగా ఉన్నప్పటికీ, ఆయా ఆస్తుల మారెట్‌ విలువ డాక్యుమెంట్లలో చూపిన విలువ కంటే అధికంగా ఉండే అవకాశం ఉన్నదని ఏసీబీ తెలిపింది. మార్కెట్‌ విలువ ప్రకారం రూ.80 కోట్లకు పైగానే ఉంటాయని అంచనా. మరిన్ని ఆస్తులపై అదనపు ధ్రువీకరణ, పరిశీలన సాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కూకట్‌పల్లి, మణికొండలో ఫ్లాట్లు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. వీటితోపాటు భువనగిరి, నందిగామ, శామీర్‌పేటలో ఓపెన్‌ ప్లాట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోనూ 800 చదరపు గజాల స్థలం ఉన్నట్టు గుర్తించారు. లక్షల విలువైన జాగ్వార్‌, ఆడి, టాటా నెక్సాన్‌ వంటి విలాసవంతమైన కార్లు, లక్షల విలువైన గ్యాడ్జెట్స్‌, అరకిలోకు పైగా బంగారు ఆభరణాలు ఉన్నట్టు తేల్చారు. దీనికితోడు ప్రైవేట్‌ సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో లక్షలు పెట్టుబడి పెట్టినట్టు గుర్తించారు. రూ.41 లక్షల బ్యాంక్‌ బ్యాలెన్స్‌, రూ.12 లక్షల పోస్టాఫీస్‌ డిపాజిట్లు కూడా ఉన్నట్టు నిర్ధారించారు.*

*లక్ష్మీభాస్కర్‌ వద్ద గుర్తించిన స్థిర, చరాస్తుల వివరాలు..*

*హైరైజ్‌ గేటెడ్‌లో ఫోర్‌ బెడ్రూమ్‌ ఫ్లాట్‌*

*కూకట్‌పల్లిలో హైరైస్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో 2 ట్రిపుల్‌ బెడ్రూమ్‌ ఫ్లాట్లు*

*మణికొండ, పేట్‌ బషీరాబాద్‌, కూకట్‌పల్లిలో 5 డబుల్‌ బెడ్రూమ్‌ ఫ్లాట్లు*

*యాదాద్రి భువనగిరి, నందిగామ,*

*శామీర్‌పేటలో 4 ఓపెన్‌ ప్లాట్లు*

*ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో 800 చదరపు గజాల ఓపెన్‌ ప్లాట్‌*

*బ్యాంకుల్లో 41 లక్షల నగదు నిల్వలు*

*పోస్టాఫీసుల్లో రూ.12 లక్షల డిపాజిట్లు*

*ఫైనాన్స్‌ల్లో 35 లక్షల పెట్టుబడులు*

*మ్యూచువల్‌ ఫండ్స్‌లో రూ.29.55 లక్షల పెట్టుబడులు*

*3 కిలోల 517.8 గ్రా. బంగారు ఆభరణాలు*

*అత్యంత ఖరీదైన జాగ్వార్‌, ఆడి, టాటా నెక్సాన్‌ వంటి కార్లు నాలుగు బైక్‌లు,*

*ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌*

*డీఆర్‌టీ వివాదాస్పద ఫ్లాట్‌ కొనుగోలుకు రూ.1.30 కోట్లు*

*వివిధ వ్యక్తులకు వడ్డీకి ఇచ్చిన మొత్తం రూ.1.33 కోట్లు*

Latest Articles

*హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు 24 గంటలు బంద్* ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్...

ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్.. ఎస్ఐ మృతి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

దళిత భూములను భూకబ్జా చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలి.

 కాశినాయన సెప్టెంబర్ 22 పొలిటికల్ పవర్ పి యన్ 9టీవీ సమగ్ర...

నాగిశెట్టిపల్లె రెవెన్యూ పొలంలో పంట కాలువ పూడ్చివేతపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

సర్వే నంబర్ 423లో దొంగ రికార్డులు సృష్టించి ఆక్రమణలకు పాల్పడిన వారిపై...

లింగారెడ్డి పల్లె ఎస్డబ్ల్యుపిసి కేంద్రం నందు వానపాములు విడుదల

 ... కలసపాడు సెప్టెంబర్ 22 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలను జయప్రదం చేయండి

ప్రముఖ వచన కవి మర్రికంటి నరసింహ కు గుర్రం జాషువ సాహిత్య...

Related Articles

ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్.. ఎస్ఐ మృతి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*ట్యాంక్ బండ్ క్రేన్ 2 వద్ద గణేష్ నిమజ్జనం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

బ్రేకింగ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర...

*ఫార్మా దోపిడీపై  అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ప్రాణాలు కాపాడే మందులా? రోగులను నిలువునా దోచే వ్యూహాలా?క్యాన్సర్......
error: Content is protected !!