బ్రేకింగ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నర్సింగ్ చదువుతున్న ఓ యువతి ఇంటి ఆవరణలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మృతురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, వెంగన్నపాలెం గ్రామానికి చెందిన హరిణి (18) గా గుర్తించారు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.
తండ్రి ఇటీవల మరణించడంతో తల్లి రాజేశ్వరి కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు కూతుళ్లను ఎంతో కష్టపడి చదివిస్తోంది. సెలవుల నేపథ్యంలో హరిణి కొద్ది రోజుల క్రితమే ఇంటికి వచ్చింది.
అదే గ్రామంలో చుట్టాల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన తల్లి రాజేశ్వరి ఇంట్లో కూతురు కనిపించకపోవడంతో ఆందోళనతో వెతకడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇంటి ఆవరణలోని బాత్రూం వెనుక భాగంలో హరిణి ఒంటిపై గాయాలతో విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.
పక్కింటి వ్యక్తే తన కూతురిపై దారుణానికి పాల్పడి హ***త్య చేశాడని మృతురాలి తల్లి రాజేశ్వరి ఆరోపిస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి అనుమానాస్పద కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

