ePaper
Friday, September 25, 2026
📄 ePaper

పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ వాహనాన్ని ఢీకొన్న లారీ

📰 Generate e-Paper Clip

  • ఎస్సై, డ్రైవర్‌ కు తీవ్ర గాయాలు – ఆసుపత్రిలో పరామర్శించిన ఖమ్మం పోలీస్ కమిషనర్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి రమేష్ సెప్టెంబర్ 24 2026: బుధవారం రాత్రి పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఎస్సైతో పాటు పోలీస్ వాహన డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీశ్ పరిస్థితి నిలకడగా వుంది, డ్రైవర్‌ కొత్తపల్లి రాకేష్ కు మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ రాత్రి ఆసుపత్రికి చేరుకుని గాయపడిన ఎస్సై, డ్రైవర్‌ను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం రాకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. విధినిర్వహణ లో భాగంగా రాత్రి పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం పట్ల పోలీస్ కమిషనర్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన సిబ్బంది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బుధవారం అర్ధరాత్రి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చేపల లోడుతో వెళ్తున్న AP-16-TH-6179 నంబర్ గల లారీ తిరుమలాయపాలెం గ్రామ శివారులోని భవానీ హోటల్ సమీపంలో ఎదురుగా వస్తున్న పోలీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. లారీ డ్రైవర్ షేక్ రసూల్ (65) వాహనాన్ని వేగంగా నడుపుతూ ఢీకొట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. లారీ డ్రైవర్‌పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేలా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

తెలంగాణ లో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట...

చార్మినార్‌కే చిల్లు! ఊడిపడుతున్న పెచ్చులు.. చారిత్రక కట్టడంపై నిర్లక్ష్యపు నీడ!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

అఖిలపక్షఐక్యవేదికజిల్లానాయకుల ఆధ్వర్యంలో వినాయకుడి కి ఘనంగావీడ్కోలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్...

Related Articles

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం..

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని పోలీస్ వాహనం ధ్వంసం.. ఎస్సై, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. *వినాయక నిమజ్జన విధులు ముగించుకుని పిండిప్రోలు నుంచి తిరుమలాయపాలెం పోలీస్‌స్టేషన్‌కు తిరిగి వస్తుండగా గురువారం అర్ధరాత్రి...

ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు.. ఒక కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుపై నమ్మకం. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా గృహ నిర్మాణానికి పెద్దపీట వేసి, పేద‌ల‌...

ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్.. ఎస్ఐ మృతి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*ట్యాంక్ బండ్ క్రేన్ 2 వద్ద గణేష్ నిమజ్జనం...
error: Content is protected !!