ePaper
Friday, September 25, 2026
📄 ePaper

వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

📰 Generate e-Paper Clip

స్పందించనందుకు అంబేద్కర్ విగ్రహం కు వినతిపత్రం అందించిన విఆర్ఏ లు

ఏపీ వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మెన్ నల్లిపోగు నాగేశం డిమాండ్

బ్రహ్మంగారిమఠం:సెప్టెంబర్ 25: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో యం వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్) లు సుమారు 20 వేలు మంది గ్రామస్థాయిలో తహాశీల్దార్ కార్యాలయాల నందు ప్రభుత్వ విధులు నిర్వహిస్తూ 9 ఏండ్లుగా కేవలం రూ.10,500 వేతనంతో దుర్భర జీవితాలను గడుపుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయం అని వెంటనే సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని ఏపీ వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మెన్ నల్లిపోగు నాగేశం డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా బ్రహ్మంగారిమఠం మండలం తహాశీల్దార్ కార్యాలయం ఎదుట సమ్మె లో భాగంగా ట్ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
సమ్మెతలపెట్టి నేటికీ 10 రోజులు గడుస్తున్న ప్రభుత్వం స్పందించుకోవడం అన్యాయం అన్నారు ఎందుకు నిరసనగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఆర్ఏ లు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఎదురు చూశామని కానీ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నందున విధిలేని పరిస్థితుల్లో సమ్మె లోకి వెళ్ళవలసి వచ్చిందని ఆయన వివరించారు.న్యాయమైన హక్కుల కోసం శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాలను ప్రభుత్వం గుర్తించి,చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం చూపాలని వారు ప్రభుత్వాని కోరారు.పేద ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి న్యాయం చేయాలన్నారు.ఉద్యమం విజయవంతం కావాలనీ న్యాయమైన డిమాండ్లు సాధించాలనీ
ఇందుకు రాష్ట్రంలోని వీఆర్ఏలు అందరూ ఐక్యం తో కదిలి సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రం వలె వీఆర్ఏలకు తక్షణం పే స్కేల్ అమలు చెయ్యాలని.డి.ఏ. బకాయిలు వెంటనే విడుదల చెయ్యాలని,నామినీలుగా ఉన్న వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని,ప్రమోషన్లు వీఆర్ఓ, రికార్డ్ అసిస్టెంట్,కంప్యూటర్ ఆపరేటర్,అటెండర్,వాచ్ మెన్, డ్రైవర్లుగా పదోన్నతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విఆర్ఏ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బొట్లా నాగసుబ్బయ్య యాదవ్,మండల కార్యదర్శి పాణ్యం చెన్నయ్య,అధ్యక్షులు మాగిపోగు కర్ణ,ఎం.మాధవి,ఆండ్రోస్,ఏ.ఉదయ్,బీసీ గురప్ప,పి.నరసయ్య, ఎం.చిన్నమ్మ,ఎన్.శ్రీలక్ష్మి,మూరతోటి కుట్టి,పి.కేశవ
తదితరులు పాల్గొన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ
(సిపిఐ)సంఘీభావం

నిరుపేద వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ పేదలు వీఆర్ఏలు అధిక శాతం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించి న్యాయం చేయకపోవడం అన్యాయం అన్నారు.నేటికీ సమ్మె 10 రోజులు గడుస్తున్న ప్రభుత్వం స్పందించలేదని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల కార్యదర్శి పెద్దుళపల్లి ప్రభాకర్ అన్నారు.ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా కార్మిక వర్గాలను ఏకం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మైదుకూరు నియోజకవర్గం ఏరియా కార్యదర్శి గుడిమే సురేష్ పాల్గొన్నారు.

Latest Articles

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘన స్వాగతం రామావత్ రమేష్ నాయక్

పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక ప్రతినిధి వనం శ్రీనివాస్ స్టేట్ క్రైమ్...

గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు బీఆర్‌సీ పాయింట్‌ పర్సన్‌లకు శిక్షణ

ఇన్‌పుట్స్‌ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంకలసపాడు సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ టీవీ...

 ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ.....

ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ..

 సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ . సమగ్ర జాతీయ తెలుగు...

ఏడాది పోరాటం ఫలించింది.. ఎగమాలపాడుకు రూ.2.63 కోట్ల రోడ్డు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

Related Articles

గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు బీఆర్‌సీ పాయింట్‌ పర్సన్‌లకు శిక్షణ

ఇన్‌పుట్స్‌ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంకలసపాడు సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎన్ ప్రసాద్ రావు కలసపాడు వైఎస్సార్ కడప జిల్లా.ఆంధ్రప్రదేశ్‌ ప్రజా భాగస్వామ్య ప్రకృతి...

 ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ.. కలసపాడు సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ . సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు....

ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ..

 సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ . సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు. వైయస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండలం లోని తెల్లపాడు గ్రామపంచాయతీని...
error: Content is protected !!