ePaper
Friday, September 25, 2026
📄 ePaper

మనిగిళ్లలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

 

జిల్లా, మండల స్థాయి అవార్డులు రావడం గ్రామానికి గర్వకారణం: సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 2026: పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో జిల్లా, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఉపాధ్యాయులను శుక్రవారం ఘనంగా సన్మానించారు. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన వడ్డేమాన్ రాముడు, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న జీకే శ్రీనివాస్‌లను గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… మనిగిళ్ల గ్రామానికి జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు రావడం గర్వకారణమన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం విద్యను అందించడమే కాకుండా వారి భవిష్యత్తుకు బాటలు వేస్తారని పేర్కొన్నారు. మన దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మాణమవుతుందని అన్నారు. ఉపాధ్యాయులే భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దే కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ శాంతన్న, జెడ్పీహెచ్‌ఎస్ మనిగిళ్ల హెచ్‌ఎం ఏ. వెంకటేశ్వర్లు, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం నర్సరీ మేడం, ఉపాధ్యాయ బృందాలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు.

Latest Articles

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘన స్వాగతం రామావత్ రమేష్ నాయక్

పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక ప్రతినిధి వనం శ్రీనివాస్ స్టేట్ క్రైమ్...

గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు బీఆర్‌సీ పాయింట్‌ పర్సన్‌లకు శిక్షణ

ఇన్‌పుట్స్‌ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంకలసపాడు సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ టీవీ...

 ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ.....

ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ..

 సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ . సమగ్ర జాతీయ తెలుగు...

ఏడాది పోరాటం ఫలించింది.. ఎగమాలపాడుకు రూ.2.63 కోట్ల రోడ్డు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

Related Articles

ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలి..

గుడిసెలు లేని వనపర్తి జిల్లా లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు  మొదటి విడతలో ఇంటి నిర్మాణం ప్రారంభించుకొని వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు ఒకేసారి బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి వనపర్తి...

అస్పృశ్యత, అసమానతలను సామాజిక స్పృహతో రచనలు సాగించిన మహాకవి గుర్రం జాషువా.

హోదా లేని ప్రతిపక్ష పాత్ర పోషించిన కవి గుర్రం జాషువా.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 2026:...

గణేష్ ఉత్సవ కమిటీ వారు నిబంధనలు పాటిస్తూ పూజలు త్వరగా ముగించి వెలుతురు ఉండగానే విగ్రహాలను తరలించాలి

– జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎం 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్. సెప్టెంబర్. 26. 2026.గణేష్ ఉత్సవ కమిటీ...
error: Content is protected !!