ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper

వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్‌ ఛైర్మన్‌ కాకుమాను రాజశేఖర్‌ గారి కుటుంబాన్ని పరామర్శించిన  మాజీ ముఖ్య మంత్రి వైయస్‌ జగన్‌ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా

📰 Generate e-Paper Clip

  • *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఒంగోలులో పర్యటించారు.

ఒంగోలు క్లౌ పేటలోని వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్‌ ఛైర్మన్‌ దివంగత కాకుమాను రాజశేఖర్‌ నివాసానికి వెళ్లిన శ్రీ వైయస్‌ జగన్‌, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కాకుమాను రాజశేఖర్‌ మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన శ్రీ వైయస్‌ జగన్‌, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చారు.

కాకుమాను రాజశేఖర్‌ పార్టీకి అందించిన సేవలను ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ గుర్తుచేసుకున్నారు. పార్టీ పట్ల నిబద్ధతతో, అంకితభావంతో ఆయన పనిచేశారని పేర్కొన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు.

రాజశేఖర్‌ కుటుంబం ఒంటరిది కాదని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని శ్రీ వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడి, వారికి ధైర్యం చెప్పిన అనంతరం శ్రీ వైయస్‌ జగన్‌ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.

Latest Articles

ఫ్లెక్సీలు మాటలు కాదు.. ప్రజలకు అభివృద్ధి కావాలి !

– తాడిపర్తి–తాండా, చెన్నూరు రహదారి దుస్థితిపై అఖిలపక్ష ఐక్యవేదిక ఆవేదన,పొలిటికల్ పవర్...

ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మమ్మ కుటుంబానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి పరామర్శ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ...

ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమావేశం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక | పీఎన్9 తెలుగు...

ఉప్పాడ తీరంలో అలజడి..

ఎగసిపడుతున్న సముద్రపు అలలు! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

Related Articles

39వ డివిజన్‌లో వైసీపీ విజయభేరి.. వైఎస్సార్సీపీ తుఫాన్ ప్రచారం!

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*విజయవాడ 39వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్...

error: Content is protected !!