
వైసీపీ మీద మొదటి నుంచి ఉన్న విమర్శ గ్రౌండ్ లో యుద్ధం చేసినట్లు లీగల్ బ్యాటిల్ చేయదు అని.. వైసీపీ కేసులు గెలవదు అనీ…
ఇప్పుడు సుప్రీం కోర్ట్ నామినేషల గడువు పెంపు మీద 48 గంటలో నిర్ణయం చెప్పండి,అప్పటి వరకు తుది అభ్యర్థుల లిస్ట్ ప్రకటించొద్దు అని రాష్ట్ర ఎన్నికల సంఘం కు ఆదేశాలు ఇవ్వటం వైసీపీకి గొప్ప విజయం.. మొదటి SEC 19 స్థానాల్లో ఎన్నిక వాయిదా అని చెప్పి మళ్ళీ మనసు మార్చుకొని మొత్తం 100 స్థానాల్లో ఎన్నికలు వాయిదా వేస్తున్నాం అని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పటం ప్రభుత్వానికే కాదు “ఈనాడు”కు చెంపపెట్టు..ఈనాడు మొదటి నుంచి ఏ పక్షం వైపు ఉన్నా వార్తను ఒక మోస్తరుగా రాసేది..గత నాలుగేళ్లగా దాని స్థాయి పడిపోయింది..ఇంకో ఐదారేళ్ళ తరువాత ఏదైనా చర్చ సందర్భంలో ఈనాడు వార్తలను కోట్ చేయటం కూడా మానేస్తారు..
ఎంత లేదని చెప్పినా అధికారులు గన్స్ బయటకు తీయటం,నామినేషన్ వేయటానికి వెళ్తున్న వైసీపీ అభ్యర్థులను శాంతిభద్రతల పేరుతొ హౌస్ అరెస్ట్ చేసే వీడియోలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి..
రిటర్నింగ్ అధికారుల చేతుల్లో నుంచి వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పాత్రలను అధికారపార్టీ నేతలు లాక్కొని చించేస్తుంటే పోలీసులు చూస్తు ఉన్నారు.. ఏ ఒక్క రిటర్నింగ్ అధికారి కూడా తమ చేత్తుల్లోనుంచి నామినేషన్ పత్రాలు లాక్కున్నారని కంప్లైంట్ ఇవ్వలేదు.. అలాంటి అధికారుల మీద వైసీపీ కోర్టుకు వెళితే కోర్టు అడిగే మొదటి ప్రశ్న ఇదే?మీరు కంప్లైంట్ ఇచ్చారా ?అని..
మరీ కామెడీగా ఎదో మున్సిపాలిటీలో 21 మంది వైసీపీ అభ్యర్థులు నామినేషన్ మీద సంతకాలు చేయలేదని వారిని నామినేషన్ తిరష్కరించారంట ..ఒకరు ఇద్దరు కాదు 21 మంది సంతకాలు లేవంటే అది కుట్ర అని సదరు అధికారికి తెలియలేదు పాపం..నామినేషన్ వేయటం కూడా చేతకాలేదు అని అధికార పార్టీ నేతల వెటకారం ..
మీ హాయంలో అంతా చక్కగా జరిగిందా అని మీడియా ముందు అడిగినట్లు కోర్టు ముందు అడగలేరు..ఒక్క కంప్లైంట్ రాలేదని SEC తరుపు లాయరు అంటే కోర్టు నవ్విందట.ఇప్పుడు కూడా తిరకాసుగా వ్యవహరిస్తే కోర్టుకు జవాబుదారీ అధికారులే అవుతారు.

