గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహణ 
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మొజర్ల సర్పంచ్ కె చంద్రశేఖర్ మాట్లాడుతూ… రామాయణ మహాకావ్యాన్ని రచించి ప్రపంచానికి ధర్మం, నీతి, మానవతా విలువలను చాటిచెప్పిన మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఆయన బోధనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, సమానత్వం, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహర్షి వాల్మీకి ఆశయాలను ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, వాల్మీకి సంఘం నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


