ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

పామిరెడ్డిపల్లిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఆదికవి శ్రీశ్రీశ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం మాట్లాడుతూ… రామాయణ మహాకావ్యాన్ని రచించిన ఆదికవి వాల్మీకి మహర్షి గొప్ప పరివర్తనకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. రత్నాకరుడిగా జీవితం ప్రారంభించి, తన తపస్సు, సాధనతో మహర్షిగా ఎదిగిన మహనీయుడని కొనియాడారు. త్యాగం, సత్యం, ధర్మం, న్యాయం వంటి విలువలను తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. సీతమ్మకు ఆశ్రయం కల్పించి, లవకుశులకు విద్యాబుద్ధులు నేర్పిన కరుణామయుడని గుర్తుచేశారు. వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన బోధించిన విలువలను ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాములమ్మ, మాజీ ఎంపీపీ మనే పరెడ్డి, వార్డు సభ్యులు కృష్ణ, నరేష్, యాదయ్య, యాదమ్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భీమ్ రెడ్డి, రమేష్ గౌడ్, కొంకల నరసింహ, వెంకటయ్య, వాల్మీకి కమిటీ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశించినా ట్రాక్టర్ లోన్ మంజూరులో జాప్యం!

 ఎంపీడీవో, కార్యదర్శి స్పందించాలి — సర్పంచుల సంఘం అధ్యక్షుడు కిన్నెర వెంకన్న...

జడ్.పి.హెచ్.పాఠశాలలో పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

మేడిపల్లి : 27 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ...

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి:ఇల్లందు సబ్‌జైలును సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జి స్వరూప కాటం

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబాలు చిన్నాభిన్నం కావొద్దుఇల్లందు, పొలిటికల్ పవర్: ఖైదీలు...

బేటి బచావో బేటి పడావో అవగాహన సదస్సు

నాంపల్లి మండలం పొలిటికల్ పవర్ నాంపల్లి మండలం జడ్పీహెచ్ఎస్ పాఠశాలో బేటి బచావో...

Related Articles

పిల్లల భద్రత – సమాజ బాధ్యత బాలల హక్కుల పరిరక్షణే సురక్షిత సమాజానికి పునాది

– పిల్లల రక్షణపై కేపీఎస్ విద్యార్థులకు న్యాయ అవగాహన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి  కె. దీప, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో...

పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని  బిఆర్ఎస్ కు చెంపపెట్టుగా ఇంటి వద్దకే వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డు అందిస్తున్న ప్రజా ప్రభుత్వం

– కాంగ్రెస్ పార్టీ కొత్తకోట మండల అధ్యక్షులు నాగరాపు బీచ్పపల్లి యాదవ్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్. 28. 2026.పదేళ్లలో ఒక్క...

జర్నలిస్టుల జాతీయ పురస్కారానికి ఎంపికైన ధనుష్

జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తున్న ధనుష్ కు అరుదైన గౌరవం,అవార్డు రావడం పట్ల తనపై మరింత బాధ్యత పెరిగిందన్న ధనుష్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...
error: Content is protected !!