పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: అక్టోబర్ 26 మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని శ్రీ మహర్షి వాల్మీకి మందిరం వద్ద సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్, మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్ గారలు పాల్గొని వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆదికావ్యం రామాయణాన్ని అందించిన ఆదికవి వాల్మీకి అని అన్నారు. బోయవాడిగా ఉన్న రత్నాకరుడు నారద మహర్షి బోధనతో వాల్మీకి మహర్షిగా మారారని తెలిపారు. తపస్సుతో, జ్ఞానంతో రామాయణం అనే మహా గ్రంథాన్ని లోకానికి అందించిన మహనీయుడు వాల్మీకి అన్నారు. వాల్మీకి రచించిన రామాయణం మనకు ధర్మం, న్యాయం, త్యాగం, సత్యం, భక్తి, మానవతా విలువలను నేర్పుతుందన్నారు. రాముడు ఆదర్శ పురుషుడు ఎలా ఉండాలో, సీతమ్మ త్యాగం ఎలాంటిదో రామాయణం ద్వారా తెలుస్తుందన్నారు. వాల్మీకి కేవలం కవి మాత్రమే కాదు, ఒక సంఘ సంస్కర్త, మార్గదర్శి అని కొనియాడారు. నేటి యువత రామాయణం చదివి, దానిలోని నీతిని జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. బోయ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వాల్మీకి స్ఫూర్తితో పేద విద్యార్థులకు విద్య, ఉపాధి కల్పించాలన్నారు. వాల్మీకి రామాయణం తెలుగులోకి అనువాదం అయి ప్రజలకు మరింత చేరువైందన్నారు. వాల్మీకి మహర్షి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా, రాష్ట్ర ప్రజలందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ గౌడ్, వాల్మీకి సంఘం నాయకులు, మహిళలు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

