ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

మద్దిగట్లలో ఘనంగా ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

వాల్మీకి విగ్రహ కార్యక్రమంలో పాల్గొన్న మొగిలి సత్య రెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వాల్మీకి మహర్షికి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మొగిలి సత్యారెడ్డి, మదిగట్ల గ్రామ సర్పంచ్ రాములు యాదవ్, గట్టు మన్యం, బాజ శ్రీనివాస్, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొగిలి సత్యారెడ్డి మాట్లాడుతూ… ఆదికవి వాల్మీకి మహర్షి భారతీయ సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించుకున్న మహనీయుడని పేర్కొన్నారు. రామాయణ మహాకావ్యాన్ని రచించి సమాజానికి ధర్మం, సత్యం, నీతి, మానవతా విలువలను చాటిచెప్పారని తెలిపారు. వాల్మీకి మహర్షి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత విద్య, సంస్కారం, సామాజిక ఐక్యతకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

తెలంగాణను పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్‌ నేతలకు ఇప్పుడు కరువు గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?

– కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, నేడు...

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

Related Articles

అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 27 2026: వనపర్తి...

పిల్లల భద్రత – సమాజ బాధ్యత బాలల హక్కుల పరిరక్షణే సురక్షిత సమాజానికి పునాది

– పిల్లల రక్షణపై కేపీఎస్ విద్యార్థులకు న్యాయ అవగాహన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి  కె. దీప, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో...

పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని  బిఆర్ఎస్ కు చెంపపెట్టుగా ఇంటి వద్దకే వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డు అందిస్తున్న ప్రజా ప్రభుత్వం

– కాంగ్రెస్ పార్టీ కొత్తకోట మండల అధ్యక్షులు నాగరాపు బీచ్పపల్లి యాదవ్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్. 28. 2026.పదేళ్లలో ఒక్క...
error: Content is protected !!