
మేడిపల్లి: 26 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆర్ వి ఫౌండేషన్ తుంగతుర్తి రవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్,రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్,జిల్లా కమిటీ సభ్యులు,పలు డివిజన్ ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యాపార ప్రముఖులు, డివిజన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని తుంగతుర్తి రవిని ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నోటు పుస్తకాలు, పెన్నులు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండి రాజకీయ, వ్యాపార రంగంలో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం తుంగతుర్తి రవి మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా ప్రత్యక్షంగా, సోషల్ మీడియా మాధ్యమం ద్వారా, శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ తన కోరిక మేరకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు, బహుమతిగా అందించిన కాంగ్రెస్ నేతలకు ,కార్యకర్తలకు, మేడిపల్లి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

