ePaper
Friday, November 6, 2026
📄 ePaper

*వర్షంలో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా కాసాని పద్మ, డా. ఉదయజ్యోతి*

📰 Generate e-Paper Clip

అశ్వారావుపేట: పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరద నీరు చేరి ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాసాని పద్మ, 14వ వార్డు కౌన్సిలర్ డా. ఉదయజ్యోతి మానవతా దృక్పథంతో స్పందించారు.

వర్షాల కారణంగా ప్రయాణాలు సాగించలేక ఇబ్బందులు పడుతున్న దూర ప్రాంత ప్రయాణికులకు ఆహార పొట్లాలు, బిస్కెట్లు, తాగునీటి బాటిళ్లను పంపిణీ చేశారు. భారీ వర్షాల సమయంలో ఆకలితో ఇబ్బందులు పడకుండా ప్రయాణికులకు తమ వంతు సహాయం అందించారు.

అదేవిధంగా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ శాఖ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలకు ధైర్యం చెబుతూ, సహాయక చర్యలు చేపడుతూ, ప్రజల భద్రత కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Latest Articles

Related Articles

వరంగల్ MGM వేదికగా సమ్మె శంఖారావం.. డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్త ఆస్పత్రి కార్మికుల సమ్మెకు పిలుపు! – 20 వేల మంది శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల హక్కుల పోరాటం...

పిపిఎన్ 9 టీవీ / పొలిటికల్ పవర్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి (నవంబర్ 06, 2026):తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న శానిటేషన్, పేషెంట్...

ప్రజల మనిషిగా ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు.. ప్రత్యేక అభినందించిన ‘పొలిటికల్ పవర్’ ప్రతినిధి సత్యప్రసాద్! – ప్రజలతో మమేకమవుతూ.. సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్న డీఎస్పీ – ప్రజల గుండెల్లో ప్రత్యేక...

   పిపిఎన్ 9 న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి సత్యప్రసాద్ (నవంబర్ 06, 2026):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ప్రజల రక్షనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఇల్లందు డీఎస్పీ...

మురసు తుఫాన్ ముప్పు.. అప్రమత్తమైన ప్రగళ్లపాడు సర్పంచ్ కోరం హనుమంతు! – గ్రామస్థుల ఆరోగ్యామే ధ్యేయంగా వీధివీధినా బ్లీచింగ్ పౌడర్ పిచికారీ – సెక్రటరీని వెంటబెట్టుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్న సర్పంచ్

 పిపిఎన్ 9 న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి సత్యప్రసాద్ (నవంబర్ 06, 2026):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ప్రగళ్లపాడు గ్రామపంచాయతీలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలకవర్గం ముందుకు సాగుతోంది....
error: Content is protected !!