
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి
జగ్గయ్యపేట: జగ్గయ్యపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న చారు గుండ్ల కొండకు పార్టీ తరఫున కో-ఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించాలని స్థానికులు, ఆర్యవైశ్య ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరిన అనంతరం, జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి మొట్టమొదటగా చేరిన వ్యక్తిగా చారు గుండ్ల కొండ గుర్తింపు పొందారు. సామినేని ఉదయభాను జనసేన కండువా కప్పి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గం తరఫున కూటమి పక్షాన జనసేనలో చేరి పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తరఫున జనసేన పార్టీకి క్రియాశీలకంగా పనిచేసి తన రాజకీయ నిబద్ధతను చాటుకున్నారు.
సామాజిక సేవలో ప్రత్యేక గుర్తింపు
చారు గుండ్ల కొండ జగ్గయ్యపేట వాసవి క్లబ్ నందనవనం వ్యవస్థాపక అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి సమితి – సమైక్య భారతి జగ్గయ్యపేట నియోజకవర్గ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జగ్గయ్యపేట ఆర్యవైశ్య మండలి మాజీ కార్యదర్శిగా కూడా సేవలందించారు.
పర్యావరణ పరిరక్షణకు వినూత్న కార్యక్రమాలు
‘వనం – మనం’ కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే సంకల్పంతో పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో రైతు బజార్ ఏర్పాటు చేసి, ప్రజలు తీసుకొచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలకు బదులుగా కూరగాయలు అందించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
రాజకీయ సేవతో పాటు సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణలోనూ తనదైన ముద్ర వేస్తున్న చారు గుండ్ల కొండకు జనసేన పార్టీలో సముచిత గుర్తింపు కల్పించాలని ఆర్యవైశ్య సామాజిక వర్గీయులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

