ePaper
Sunday, November 8, 2026
📄 ePaper

గిరిజన పోరాటానికి దక్కిన విజయం…! ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు.. సేవాలాల్ సేన పోరాట ఫలితం గిరిజన పోరాటానికి దక్కిన విజయం..

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి:

ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు.. సేవాలాల్ సేన పోరాటమే ఫలితం..

గిరిజనుల దశాబ్దాల కల సాకారం

ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు భుక్యా నరసింహా నాయక్

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు ఉమ్మడిగా కొనసాగిన కమిషన్‌ను వేరు చేసి, గిరిజనుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సేవాలాల్ సేన హర్షం వ్యక్తం చేసింది. ఇది గిరిజన సంఘాల నిరంతర పోరాటానికి, ముఖ్యంగా సేవాలాల్ సేన ఉద్యమానికి దక్కిన విజయమని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు భుక్యా నరసింహా నాయక్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన నాయకత్వంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భుక్యా సంజీవ్ నాయక్ దిశానిర్దేశంలో, రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ హుస్సేన్ నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరంతర ఉద్యమాలు, పోరాటాల ఫలితంగానే ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు. గిరిజనుల దశాబ్దాల ఆకాంక్షను గుర్తించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సేవాలాల్ సేన తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సేవాలాల్ సేన ఆవిర్భావం నుంచి గిరిజనుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, తండాల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పోరాడుతోందని పేర్కొన్నారు. గిరిజన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ‘గిరిజన గళం–తండాల్లో నిద్ర’ వంటి చైతన్య కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు గుర్తుచేశారు. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుతో గిరిజనులకు న్యాయం జరిగే దిశగా మరో కీలక ముందడుగు పడిందని ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు ఒక్కటే సరిపోదని, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం సేవాలాల్ సేన రూపొందించిన ‘సేవాలాల్ డిక్లరేషన్‌’తో పాటు కాంగ్రెస్ పార్టీ గతంలో చేవెళ్లలో ప్రకటించిన ‘చేవెళ్ల డిక్లరేషన్‌’ను కూడా ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల విద్య, వైద్యం, ఉపాధి, భూమి హక్కులు, తండాల మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి భుక్యా వినోద్ కుమార్ రాథోడ్, ఉపాధ్యక్షులు లకావత్ దేవేందర్ నాయక్, ఏన్కూరు మండల అధ్యక్షుడు గుగులోత్ మజిలాల్ నాయక్, మండల నాయకులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest Articles

*బయలువీరభద్రస్వామివారి విశేషపూజలు

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 8 (పొలిటికల్ పవర్ న్యూస్)ఈ...

*రైల్వే కోడూరు నియోజకవర్గంలో క్యాంప్ రాజకీయాలు మొదలాయే…??*

పొలిటికల్ పవర్ ప్రతినిధి ఓబుళవారిపల్లిపుల్లంపేట మండలంలో టిడిపి వారు క్యాంపు రాజకీయం...

నరకాసుర వధ ఘనంగా నిర్వహించిన వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులు

నరకాసుర వధ ఘనంగా నిర్వహించినవేణుగోపాల స్వామి ఆలయ కమిటీ సభ్యులుపొలిటికల్ పవర్...

అశ్వారావుపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సూచనల మేరకు ఘనంగా సంబరాలు మున్సిపల్ వైస్ చైర్మన్...

పేదల ఇళ్లలో దీపావళి వెలుగులు నింపిన ఇందిరమ్మ ప్రభుత్వం

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్ల వద్ద దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే...

దీపావళి సందర్భంగా మోజర్లలో ఘనంగా వాలీబాల్ పోటీలు

  విజేతలకు బహుమతులు అందజేసిన గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ పొలిటికల్ పవర్ సమగ్ర...

Related Articles

error: Content is protected !!