ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*జర్నలిస్టుల ఐక్యతకు కొత్త వేదిక..*

*ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యత్వాలకు ఆహ్వానం..*

 

 

ఖమ్మం, మే 08:

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులు, డిజిటల్ మీడియా ప్రతినిధులు, యూట్యూబర్లు, ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లందరికీ ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఐ. ప్రభాకర్ తెలిపారు. ఇటీవల ఘనంగా నిర్వహించిన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి మీడియా వర్గాల నుంచి విశేష స్పందన లభించిందన్నారు.

ప్రెస్ క్లబ్‌ను జర్నలిస్టుల హక్కులు, ఐక్యత, సంక్షేమానికి అంకితమైన వేదికగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రారంభ దశలో 10 మంది సభ్యులతో తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పుడు పూర్తి స్థాయి కమిటీ పునర్వ్యవస్థీకరణ కోసం జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి మీడియా ప్రతినిధి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రెస్ క్లబ్ బలోపేతానికి భాగస్వాములు కావాలని కోరారు.

జర్నలిస్టులు, ప్రజలు ప్రెస్ మీట్లు నిర్వహించు కునేందుకు ఆధునిక సదుపాయాలతో ప్రెస్ క్లబ్‌ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఫ్రీ వైఫై, మినరల్ వాటర్, ఏసీ – నాన్ ఏసీ హాళ్లు, మరుగుదొడ్లు, సీసీ కెమెరాల నిఘా వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. సాధారణ ప్రెస్ మీట్‌లకు రూ.600, కమర్షియల్ ప్రెస్ మీట్‌లకు రూ.1000 రుసుము నిర్ణయించినట్లు ఐ. ప్రభాకర్ వెల్లడించారు.

*సంప్రదించగలరు*:ఐ. ప్రభాకర్,అధ్యక్షులు, ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్, సెల్: 7013958751

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!