ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*_తెలంగాణలో బీసీ కులాల పేర్లు మార్పు.. కొత్త పేర్లు ఇవే!_*

 

 

పొలిటికల్ పవర్ సమగ్ర దినపత్రిక తెలుగు PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

_BC Caste Names Change: తెలంగాణలోని వెనుకబడిన తరగతుల (బీసీ) చిరకాల వాంఛను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన సామాజిక సంస్కరణకు శ్రీకారం చుట్టింది._

 

_సమాజంలో కించపరిచే విధంగా ఉన్న కొన్ని కులాల పేర్లను తొలగించి, వాటి స్థానంలో గౌరవప్రదమైన పేర్లను చేరుస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. బీసీ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆయా వర్గాల ఆత్మగౌరవం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పులు తక్షణమే రాష్ట్ర గెజిట్ ద్వారా అధికారిక రికార్డుల్లోకి రానున్నాయి._

 

*_BC Caste Names Change: బీసీ గ్రూప్-ఏలో విప్లవాత్మక మార్పులు_*

 

_ప్రభుత్వం చేపట్టిన ఈ మార్పుల్లో బీసీ గ్రూప్-ఏ విభాగంలో అత్యధిక మార్పులు జరిగాయి. ముఖ్యంగా వినడానికి అసభ్యకరంగా ఉన్న పదాలను రికార్డుల నుంచి పూర్తిగా తొలగించారు._

 

_దొమ్మర:_ ఈ పేరును తొలగించి _’గడ వంశీయ’గా మార్చారు._

_పిచ్చకుంట్ల: ఇకపై ఈ కులస్తులను ‘వంశ రాజ్’గా వ్యవహరిస్తారు._

_బుడబుక్కల: వీరికి ‘శివ క్షత్రియ’ అనే గౌరవప్రదమైన పదాన్ని జోడించారు._

_వీరభద్రియ: వీరి కోరిక మేరకు ‘వీరముష్టి, నెట్టి కోటల’ అనే పదాలను పర్యాయపదాలుగా చేర్చారు._

వన్నార్:_ _ఈ పదాన్ని తొలగించి, రజక/చాకలి వర్గాల కోసం ‘ధోబీ’ అనే పదాన్ని ఖరారు చేశారు._

_గ్రూప్-డిలో ‘శూద్ర’ పదం తొలగింపు_

 

_బీసీ గ్రూప్-డి విభాగంలో కూడా ప్రభుత్వం సామాజిక స్పృహతో పలు మార్పులు చేసింది. ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉన్న ‘శూద్ర కులం’ అనే పదాన్ని అధికారిక రికార్డుల నుంచి పూర్తిగా తొలగించారు. ఆ స్థానంలో ‘తమ్మలి (బ్రాహ్మణేతర)’గా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల ఆ వర్గానికి స్పష్టమైన సామాజిక గుర్తింపు లభిస్తుంది. అలాగే వరుస సంఖ్య 5లో ఉన్న ‘మేర’, ‘చిప్పోలు‘ కులాలకు అదనంగా ‘మేరు’ అనే పదాన్ని చేర్చారు._

 

*_విద్యార్థులు, ఉద్యోగార్థులకు మేలు_*

 

_ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాల్లో (Caste Certificates) గౌరవప్రదమైన పేర్లను పొందే అవకాశం కలుగుతుంది. సమాజంలో పిలిచేటప్పుడు కలిగే ఇబ్బందులను తొలగించి, ఆయా వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే ఈ సంస్కరణ ముఖ్య ఉద్దేశమని బీసీ కమిషన్ వెల్లడించింది. కులాల పేర్ల మార్పుపై హర్షం వ్యక్తం చేస్తున్న బీసీ సంఘాలు, ఇది తమ సామాజిక హోదాను పెంచుతుందని అభిప్రాయపడుతున్నాయి._

Latest Articles

వీరాయిపల్లిలో వరి, వేరుశనగ పంటలపై క్షేత్ర సందర్శన

చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాల గుర్తింపు.. రైతులకు శాస్త్రీయ సూచనలు పొలిటికల్...

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:వైరా నియోజకవర్గం జూలూరుపాడులో *బార్బర్స్ డే* సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో...

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసమాజ...

  పొలిటికల్ పవర్ - ప్రత్యేక కథనం కల్తీ నీటి దందా.. ప్రాణాల మీద చెలగాటం! నిబంధనలకు నీళ్లొదులుతున్న అనధికార వాటర్ బాటిల్స్ వ్యాపారంప్రస్తుత కాలంలో ఎండాకాలం మాత్రమే కాదు, అన్ని కాలాల్లోనూ మంచినీటి అవసరం విపరీతంగా...
error: Content is protected !!