గ్రామాలలో ప్రజలు జనాభా సర్వేకు సహకరించాలి
ప్రతి ఇంటి వివరాలు నమోదు చేసుకోవాలని తహసిల్దార్ పాండు నాయక్ విజ్ఞప్తి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 12 2026: పెద్దమందడి మండలంలో ఇంటి నెంబర్ల సర్వే నేడు రేపటితో ముగియనుంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రభుత్వ ఎనిమరేటర్లు లకు సహకరించాలని పెద్దమందడి మండలం తహసిల్దార్ పాండు నాయక్ కోరారు. గురువారం నుంచి గ్రామాలలో ప్రతి ఇంటికి ఎనిమరేటర్లు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఫారం లోని 34 కాలమ్స్ వివరాలను మొబైల్ ఆధారిత ఆన్‌లైన్ డిజిటల్ విధానంలో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు గ్రామ సెక్రటరీల సహకారంతో సరైన వివరాలను అందించాలని సూచించారు. ప్రతి ఇంటి వివరాలు సర్వేలో నమోదు కావడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. సర్వే నిర్వహిస్తున్న ఎనిమరేటర్ల ఐడి కార్డులను గుర్తించి మాత్రమే వివరాలు ఇవ్వాలని ప్రజలకు సూచించారు. గ్రామాలలోని ప్రజాప్రతినిధులు కూడా సర్వే కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రతి ఇల్లు సర్వే పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జనాభా సర్వే విజయవంతానికి అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రజల సహకారం ఎంతో అవసరమని తహసిల్దార్ పాండు నాయక్ తెలిపారు.
