పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 13 2026: యావత్తు తెలంగాణ సమాజాన్ని కుదిపేసిన ఫోక్సో కేసు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చీకటి స్నేహం వల్లే బలహీనపడ్డది అని రాష్ట్ర బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం రోజు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలసి వారి స్వగృహంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… తెలంగాణను కుదిపేసిన ఫోక్సో కేసు. మహిళా లోకాని మనోవేదన గురి చేసింది. తెలంగాణ హోమ్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి. పోలీస్ అధికారులు మొత్తం హోమ్ శాఖ పరిధిలోకి వస్తాయి. కేంద్ర హోమ్ శాఖ మంత్రి బండి సంజయ్ వారి చీకటి స్నేహం వల్లే కేసు బలహీనపడ్డది. షేక్ బషీరాబాద్ ఒక మహిళ ఫిర్యాదు చేస్తే ఆరు గంటలు పట్టింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి స్వయాన బండి సంజయ్ కుమారుడు. ఫోక్సో చట్టంలో అత్యంత కఠినమైన శిక్షలు ఉంటాయి. బండి సాయి భగీరథ మేనమామ కు 5,6సెక్షన్లు పెట్టమని నోటీసులు ఏస్ఐ జారీ చేశారు. నేరం చేసిన వ్యక్తి తండ్రికి నోటీసులు ఇవ్వకుండా మేనమామ కు ఇవ్వడంలో ఔచిత్యం ఏమిటి? డిజిపి ని అడుగుతున్నా ఎన్నో సార్లు అత్యాచారం చేసిన సాయి భాగీరథకు నోటీసులు ఇవ్వడం ఏమిటి. సంజయ్ బెదిరింపులకు వేలాది మంది సమక్షంలో పాల్పడుతున్నాడు. కరీంనగర్ ఎస్పి బెదిరింపులకు పాల్పడిన సంజయ్ మీద సుమోటో కేసు పెట్టాలి. అమాయక మైనారిటీ బాలికను ట్రాప్ లో బండి సాయి భగీరథ్ వేసుకున్నాడు. ఎన్నిసార్లు ఫామ్ హౌస్,ప్రైవేట్ బిల్డింగ్లో సాయి మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. బండి సాయిని కాపాడే ప్రయత్నం తండ్రి సంజయ్ చేశాడు. రేవంత్ రెడ్డి సహకారంతో బండి సంజయ్ పోలీస్ శాఖను ప్రభావితం చేశారు. బాలిక కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి వంశీ అనే వ్యక్తితో ఫిర్యాదు చేశాడు. బిజెపి నాయకులు సంగప్ప బాలిక కుటుంబానికి, బండి సంజయ్ కి సయోధ్య చేయడానికి ప్రయత్నం చేశాడు. బాలిక కుటుంబాన్ని బండి సంజయ్ చంపేస్తా అని బెదిరించాడు. బండి సాయి అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టీ వాళ్ళ గౌరవానికి భంగం కలిగించారు. మున్నూరు కాపులకు విజ్ఞప్తి అమ్మాయి కూడా మున్నూరు కాపు అని గుర్తించాలి. మైనర్ బాలిక ఆత్మహత్యకు తండ్రి కొడుకులు బండి సంజయ్, సాయి పురిగొల్పారు. మే8 తారీఖు బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఇక్కడ కేసు రిజిస్టర్ చేయకుండా కరీంనగర్ లో అమ్మాయి కుటుంబం మీద కేసు రిజిస్టర్ చేశారు. రేవంత్ ప్రోద్బలంతో బండి.సంజయ్ కుమారుడు కాపాడబడుతున్నాడు. అమ్మాయి కుటుంబంపై 308 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 308 క్లాజ్ 5 కిందికి రాదు. కేవలం అమ్మాయి కుటుంబంపై వేధింపుల కోసం తీవ్రమైన కేసు పెట్టారు. నరేంద్ర మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటా అంటే అప్పుడు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం బాధలు వినకుండా వేధింపులకు ప్రభుత్వం పాల్పడింది. బండి సంజయ్ మీద సెక్షన్ 11,12 కేసులు పెట్టీ స్టేషన్ బెయిల్ ఇచ్చారు. లుక్ ఔట్ నోటీసులు ఇవ్వడం మాని రాచమర్యాదలు చేశారు. 11తారీఖు నాడు రేవంత్ నిద్ర లేచి నామ మాత్రపు సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. నాన్ బెయిలబులు కేసులు బాధిత కుటుంబంపై పెట్టీ బెయిలబులు కేసులు బండి.సాయిపై పెట్టారు. సనాతన ధర్మం అంటూ మహిళలను చేరబట్టే కొడుకును బండి సంజయ్ కాపాడుతున్నాడు. బండి సాయి బగీరథ్ విదేశాలకు పారిపోయాడా లేదా పోలీసులు తేల్చారు. రేపులు, మర్డర్లు చేసే వ్యక్తులకు నోటీసులు ఇవ్వడం ఏ చట్టం ప్రకారము రేవంత్, డిజిపి చెప్పాలి. బండి సంజయ్ ఇల్లు ఎందుకు రైడ్ చేయడం లేదు. అసదుద్దీన్ ఓవైసీ మైనర్ బాలికపై అత్యాచారాన్ని ఖండించాలి. వక్ఫ్ బోర్డు చైర్మెన్ తప్పు చేస్తే కె.సి.ఆర్ పదవి నుండి తప్పించారు. కెసిఆర్ తన సొంత కూతురును కూడా సహించలేదు గుర్తు పెట్టుకో. మీడియాను సంజయ్ గుప్పిట్లో పెట్టుకొని కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. డిజిపి, సిపి, హైదరాబాద్ ,సిపి కరీంనగర్ కు విజ్ఞప్తి చట్టాన్ని కాపాడండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో శాంతి భద్రతలకు రక్షణ లేకుండా పోయింది. ఆర్ఎస్ఎస్, బిజెపి న్యాయ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి. నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు. అధికారంలో ఉంటే చట్ట వ్యతిరేక పనులు చేయవచ్చా. వ్యవస్థను బలహీనంగా చేయడం వల్ల సమాజం బలహీన పడుతుంది. చట్టానికి, రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాలని ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేశారు. మీడియా కూడా చురుకైన పాత్ర పోషించాలి. అద్భుతమైన కాళేశ్వరం కట్టిన కెసిఆర్ పై దుష్ప్రచారం చేస్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయనివారికి అండగా నిలుస్తారు. మైనర్ బాలిక కుటుంబాన్నికి ఒక సెక్షన్ మీడియా వంతపలకడం శోచనీయం కాబట్టి నైతిక విలువలు కాపాడాల్సిన బాధ్యత అన్ని సంస్థల మీద ఉంది అని నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమములో బోలెమోని లక్ష్మయ్య, గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్,మాజీ మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ సాయి కుమార్, సర్పంచ్ స్వప్న భాస్కర్, కౌన్సిలర్స్ సౌజన్య దిలీప్ రెడ్డి, ఏర్వ అరుణాశ్రీనివాస్, శిరీష రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్స్ నందిమల్ల శారద, జ్యోతి, మహిళా అధ్యక్షురాలు నాగమ్మ, కవితా నాయక్, పవిత్ర భాను, సరస్వతి, కర్రెస్వామి, సాయి కుమార్, రాజశేఖర్, వెంకట్ సాగర్, జోహెబ్ హుస్సేన్, హరిబాబు, నీలస్వామి,హేమంత్ ముదిరాజ్, చిట్యాల రాము, మంద రాము, న్యాయవాది రాజు, అనపాటి రాము, పానుగంటి విజయ్, తదితరులు పాల్గొన్నారు.
