ఆయన కళ్ళు సజీవం.

మరణించిన జీవిస్తున్న నేలకంటి రామస్వామి.

నేత్రదానం తో ఇద్దరు అందుల జీవితంలో వెలుగులు.
పొలిటికల్ పవర్ న్యూస్ పిన్ 9 టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ నివాసులు నేలకంటి రామస్వామి వయస్సు 75 సంవత్సరాలు ఎండ దెబ్బతో మరణించగా జనహిత సేవా సమితి సభ్యులు డోలి సుకుమార్ నేత్రదానం గురించి వివరించగా పుట్టెడు దుఃఖంలో ఉండి నేత్రదానం ద్వారా ఇద్దరు జీవితాల్లో వెలుగులు నింపాలని భావించి నేత్రదానం చేయడానికి ముందుకు రావడంతో LV. ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నిషన్ ప్రదీప్ నేత్రదానం లో భాగంగా కార్నియా స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ నేలకంటి రామస్వామి గారి మృతి బాధాకరమని కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉన్న భార్య నేలకంటి ఎల్లమ్మ, కుమారులు నేలకంటి నాగేష్,రాజేందర్, కృష్ణ మరియు కోడళ్లు, మనుమలు, మనుమరాండ్లు మరియు కుటుంబ సభ్యులు నేత్ర దానం ద్వారా ఇద్దరి అందులకి చూపునివ్వాలని నేత్ర దానానికి ముందుకు రావడం అభినందనీయం అని జనహిత సేవా సమితి ద్వారా ఇది 17 వ నేత్రధాన కార్యక్రమం అని వారి స్ఫూర్తితో ప్రజలందరు మరణించిన తరువాత నేత్ర, అవయవ,శరీరాలు కాల్చి బూడిద అయి వృధా కాకుండా దానం చేసి సమాజానికి ఉపయోగపడాలని నేత్రదానం చేసినపుడు మరణించిన తరువాత ఎనిమిది గంటల లోపు మరణించిన వ్యక్తి యొక్క కంటి భాగం లోని కార్నియా పొరని మాత్రమే సేకరిస్తారని నేత్ర దానం ద్వారా ఇద్దరు అందులకి చూపు ప్రసాదించి వారి ద్వారా మరణించిన ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం ఉందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వారి అవయవాలు దానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో అవయవాలు అవసరం ఉన్న ఆరుగురి ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని అలాగే శరీర దానం ద్వారా పార్థివ దేహాన్ని వైద్య కళాశాల కి అందించి కొన్ని వేల మంది వైద్య విద్యార్థుల బోధనకు ఉపయోగపడి ప్రజల వైద్య చికిత్స కి ఉపయోగపడే అవకాశం ఉందని ప్రజలందరూ అపోహలు వీడి నేత్ర, అవయవ, శరీర దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేత్రదానం అనంతరం కుటుంబ సభ్యులకు LV. ప్రసాద్ ఐ బ్యాంక్ వారి నేత్ర దాన సర్టిఫికెట్ ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి సహాయ కార్యదర్శి పెద్ది వినయ్ కుమార్,కార్యవర్గ సభ్యులు డోలి సుకుమార్, ఆడెపు గణేష్ మరియు కుటుంబ సభ్యులు బంధు మిత్రులు పాల్గొన్నారు .
*
