ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్ లాబీలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

 

జర్నలిస్టుల హౌజింగ్ పాలసీ యూనివర్సల్ గా ఉంటుందని ఆయన అన్నారు.

 

అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు.

 

“జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఎలా కేటాయించాలన్న విషయం నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి” అని ఆయన భరోసా ఇచ్చారు.

 

సొసైటీల్లో లేని వాళ్ల పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు బదులుగా, “సొసైటీలకు కాదు, ప్రతి జర్నలిస్టుకు ఒక్కొక్కరిగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!