అవినీతి అధికారుల అష్టదిగ్బందనంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం

పొలిటికల్ పవర్ ఎన్ వి ఆర్ టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ మరియు కలెక్టర్ వారి కార్యాలయం నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అందులోనూ రెవెన్యూ విభాగం అగ్రస్థానంలో నిలుస్తుంది ఇక్కడ విచిత్రము ఏంటంటే ధైర్యం చేసి బాధితులు ముందుకు వచ్చి సదరు అధికారిపై కలెక్టర్ వారికి నేరుగా ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు పోనీ వారి యొక్క ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ విచారణలో సదరు అధికారిణి అవినీతి చేసినది అని తెలిసినా కూడా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే జిల్లా కలెక్టర్ వారి కంటే కూడా ఇక్కడ పనిచేసే రెవెన్యూ అధికారులు చాలా పవర్ ఫుల్
ఇదే విషయంలో చుంచుపల్లి తాసిల్దార్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక నయీబ్ తాసిల్దార్ వారిని అవినీతి మరియు క్రమశిక్షణ చర్యల నిమిత్తం చుంచుపల్లి రెవెన్యూ ఆఫీసు నుండి దుమ్ముగూడెం మండలంలోని తాసిల్దార్ వారి ఆఫీస్ కి 13-09-2025 బదిలీ చేయగా సదరు ఉద్యోగి అక్కడ ఒక్కరోజు కూడా పని చేయకుండా తిరిగి పది రోజుల్లోనే అనగా తేదీ 23- 9- 2025 న భద్రాచలం డిప్యూటేషన్ ఫై పోస్టింగ్ తెచ్చుకోవడం అక్కడ విధుల్లో చేరడం అక్కడ కూడా తన పనితీరు మారకపోవడం గమనార్హం
అంటే అవినీతి అధికారులు భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా ప్రధమ పౌరులు కలెక్టర్ వారి కంటే కూడా ఎంతో పవర్ ఫుల్ అనేది అర్థమవుతుంది
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా అందులోనూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ శాఖ సొంత ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఈ విధమైన పరిస్థితి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అంతేకాకుండా ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ఏళ్ల తరబడి పాతుకుపోయి ఇదే రెవెన్యూ శాఖలో ఎటువంటి స్థానా చలనం లేకుండా నిత్యం పైరవీలు చేస్తూ అందినకాడికి వారి యొక్క అవినీతిని కొనసాగిస్తున్నారు ఇటువంటి అవినీతి అధికారులపై
పైఅధికారులు చర్యలు చేపట్టినా కూడా మరల రాజకీయ ఒత్తిళ్లు మరియు సిఫారసుల ద్వారా తిరిగి అదే స్థానంలో మళ్ళీ తిరిగి వెంటనే విధుల్లో చేరడం జరుగుతుంది గత ఎనిమిది సంవత్సరాలలో ఐదుగురు కలెక్టర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కి బదిలీ అయినారు కానీ
విశ్వసనీయ సమాచారం ప్రకారం గత ఎనిమిది సంవత్సరాల నుండి సొంత కలెక్టర్ పేషిలోనే ఎటువంటి బదిలీలు లేవు ఏకధాటిగా గవర్నమెంట్ రూల్ ప్రకారం గాని జీవో ప్రకారం గాని ఎటువంటి బదిలీలు చేయడం లేదు.
ఇలాంటి శాఖలు కలెక్టర్ ఆఫీసులో కోకొల్లలుగా ఉన్నాయి.
పూర్వం దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఎవరికి ఏ ఏ మండలాలలో పోస్టింగ్ కావాలో వారు తగిన రాజకీయ అండదండలతో డిప్యూటేషన్ పై ట్రాన్స్ఫర్ చేపించుకుంటున్నారు తప్ప పారదర్శకతతో కూడిన శాఖా పరమైన బదిలీలు గత ప్రభుత్వంలో కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కానీ లేవు ఇప్పటికైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని అవినీతి అధికారులను జీవో ప్రకారం బదిలీలు చేపట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు అవినీతి అధికారుల నుండి విముక్తి కలిగించాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు
