మంచిర్యాల జిల్లా కార్పోరేట్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ
జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్

మే 22, 2026:
పొలిటికల్ పవర్ PN9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
2026-27 విద్యా సంవత్సరానికి గాను కార్పోరేట్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 10 తరగతి వార్షిక పరీక్షలలో 7.0 సి జీ.పి.ఎ. ఆపై మార్కులు సాధించి కార్పొరేట్ (ఇంటర్) కళాశాలలలో ప్రవేశం పొందగోరు జిల్లాకు చెందిన ఎస్. సి./ ఎస్.టి./ బి.సి./ మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు ఆన్ లైన్ లో www.telanganaepass.gov.in వెబ్ సైట్ లో ఈనెల 20వ తేదీ నుండి జూన్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 10వ తరగతి మెరిట్ ఆధారంగా సి.జి.జి. ద్వారా ప్రవేశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు మీ- సేవ నుండి పొందిన ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మొబైల్ నెంబర్, ఈ -మెయిల్ ఐడి, 10వ తరగతిలో 7, ఆపైన గ్రేడ్ పాయింట్ (400 పైన) మార్కులు కలిగిన విద్యార్థులు మార్కుల మెమో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బి.ఎ. ఎస్./ హెచ్.పి.ఎస్. విద్యార్థులు పాఠశాల/ సంబంధిత జిల్లా అధికారి ద్వారా మ్యాపింగ్ చేసుకోవాలని, సి.బి.ఎస్.సి. విద్యార్థులు జిల్లా అధికారి ద్వారా 10వ తరగతి వివరాలు నమోదు చేసుకోవాలని, సర్టిఫికెట్ (4వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలంగాణలో చదివి ఉండాలి), వసతి గృహ బోనఫైడ్ సర్టిఫికెట్ (ప్రభుత్వ ఎస్. సి./ ఎస్.టి./ బి.సి. వసతి గృహ విద్యార్థులు మాత్రమే) కలిగి ఉండాలని తెలిపారు. ఇతర వివరాల కోసం జిల్లా షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
