ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిచీకరు చెట్టు తాండలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

చీకరు చెట్టు తాండలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 02 2026: పెద్దమందడి మండలం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చీకరు చెట్టు తాండ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.సర్పంచ్ ఆంగోత్ లలిత కిషన్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వారి ఆశయాల సాధనకు కృషి చేస్తూ గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో గ్రామాల పాత్ర కీలకమని, ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ ప్రీతి, ఉపసర్పంచ్ గుజ్జమ్మ, వార్డ్ సభ్యులు సాలమ్మ, మెఘవత్ బిక్కి, కందర్ నాయక్, మన్య నాయక్, శారద శ్రీను, ఉపాధ్యాయురాలు అనిత, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!