- బిక్కవోలు మండల వ్యవసాయ అధికారి, Smt. G. Vani

వరి పంటకు ఎకరానికి 570 రూపాయలు చెల్లించి బీమా చేసుకోవాలని ఈ బీమా చేసుకోవడం ద్వారా 38000 రూపాయల కవరేజ్ ఉంటుందని తెలియజేశారు ఈ తొలకరి సీజన్ లో ఆగస్టు 15 వరకు బీమా చేసుకునే సౌలభ్యం కల్పించారు.
మినుము పంటకు ఎకరాకు రూ. 300/-, ప్రీమియం చెల్లించాలి. మినుము పంటకు భీమా నమోదు చేసుకోవడానికి జూలై 31 ఆఖరి తేదీ.
వరి పంట నష్టం అంచనాకు గ్రామం యూనిట్ గాను మరియు మినుము పంట నష్టం అంచనాకు జిల్లా యూనిట్ గా తీసుకుంటారు.
1.4.2026 నుండి 15.8.2026 వరకు వరి పంట కు గాను రుణాలు తీసుకున్న రైతులకు సదరు బ్యాంకు లేదా సహకార సంఘాల ద్వారా ప్రీమియం చెల్లించడం జరుగుతుంది. పంట రుణాలు తీసుకొని రైతులు మీ దగ్గరలో ఉన్న CSC (మీసేవ కేంద్రం) వద్ద ప్రీమియం చెల్లించి పంట బీమా చేసుకోవాలని సూచించారు. ఈ విధంగా పంట బీమా చేసుకోవడానికి ఆధార్ కార్డు ,పట్టాదారు పాస్ బుక్ లేదా CCRC కార్డ్, బ్యాంకు అకౌంట్ కాపీ , పంట వేసినట్లు రైతు స్వీయ ధృవీకరణ పత్రం లు అవసరం. పంట నష్టం జరిగినప్పుడు దిగుబడి అంచనా ద్వారా నష్టాలను లెక్కించి బీమా సొమ్మును రైతు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు.
ముఖ్య గమనిక – పంట భీమా నమోదు కొరకు, Agristack Farmer Registry ద్వారా జెనరేట్ చెయ్యబడిన valid Farmer ID తప్పనిసరి అని గమనించాలి.


