రికార్డులో ఉన్నదానికంటే అధిగమించి మించి రేషన్ నిల్వలు గుర్తింపు,
జూలూరుపాడు17: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ఐ9 టీవీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) గురుకుల పాఠశాలలో గ్రామపంచాయతీ సర్పంచ్ సంఘం లక్ష్మి కుమారి గ్రామ కార్యదర్శి కృష్ణ ప్రజల నుంచి ఫిర్యాదు అందటంతో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు అందించాల్సిన ఆహార పదార్థాల నిల్వలను పరిశీలించిన సందర్భంగా అవసరానికి మించి రేషన్ బియ్యం, చక్కెరతో పాటు ఇతర నిత్యావసర సరుకులు పెద్ద ఎత్తున నిల్వ ఉండటాన్ని గమనించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
తనిఖీల సందర్భంగా గోదాములో ఉన్న బియ్యం బస్తాలు, చక్కెర నిల్వలు, వంట నూనెలు, పప్పులు మరియు ఇతర ఆహార పదార్థాలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్‌లో నమోదైన వివరాలు, వాస్తవంగా నిల్వ ఉన్న సరుకుల మధ్య వ్యత్యాసం ఉందా అనే అంశంపై కూడా అధికారులు ఆరా తీశారు. ప్రతి నెల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఎంత రేషన్ వస్తోంది, ఎంత వినియోగిస్తున్నారు, మిగిలిన నిల్వలకు కారణాలేమిటి అనే అంశాలపై పాఠశాల యాజమాన్యాన్ని వివరణ కోరినట్లు తెలిసింది.
అవసరానికి మించి నిల్వలు ఉండటంపై గ్రామపంచాయతీ సర్పంచ్ సంఘం లక్ష్మి. మరియు కార్యదర్శి కృష్ణ సందేహాలు వ్యక్తం చేయడంతో పాటు పూర్తి వివరాలతో నివేదిక పాఠశాల లో ఉన్న అధిక నిలవలపై అధికారుల కు సమాచారం. ఇస్తాను అని నిల్వలో ఉన్న సరుకుల కొనుగోలు, వినియోగం, పంపిణీకి సంబంధించిన అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిధులతో విద్యార్థుల కోసం సరఫరా అయ్యే ఆహార పదార్థాల వినియోగంలో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకత ఉండాలని సంఘం లక్ష్మి కుమారి కోరుతున్నారు. మరోవైపు, నిల్వలు అధికంగా ఉండటానికి పరిపాలనా కారణాలున్నాయా, లేక ఇతర కారణాలున్నాయా అనే విషయాన్ని సంబంధిత శాఖ అధికారులు సమగ్రంగా విచారించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
