42 సంవత్సరాల నిస్వార్థ ప్రజా సేవ పూర్తి చేసుకున్న ఎస్సై కొప్పుల రాయప్ప
* ఘనంగా పదవీ విరమణ మహోత్సవం
* అధికారులు, సహోద్యోగులు మరియు ప్రజల ప్రశంసలు
ఖమ్మం / డివిజన్ పొలిటికల్ పవర్ ప్రతినిధఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు అత్యుత్తమ సేవలు అందించి, ప్రజల మన్ననలు పొందిన నిస్వార్థ పోలీస్ అధికారి, ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ గౌరవనీయులు శ్రీ కొప్పుల రాయప్ప గారు ఇటీవల పదవీ విరమణ పొందారు.
గత 42 సంవత్సరాలుగా (1984 నుండి 2026 వరకు) అవిశ్రాంతంగా విధులు నిర్వర్తించిన రాయప్ప, 31-08-2026 న పదవీ విరమణ చేసిన సందర్భంగా వారి సేవకు జ్ఞాపకర్థం ప్రత్యేకంగా ‘పదవీ విరమణ మహోత్సవం‘ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు, తోటి సహోద్యోగులు, పలువురు ప్రముఖులు మరియు JSPW సోదరులు పెద్దపాక రమేష్ నామ వినోద్ కుమార్ యర్ర నాగరాజు రెడ్డి పాల్గొని ఆయన సేవలను కొనియాడారు.
ప్రజలతో మమేకమై శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన చూపిన చొరవ, బాధ్యతాయుతమైన నిర్వహణ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని వక్తలు ప్రశంసించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో కూడిన ఆయన ప్రయాణం ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు.
శ్రీ కొప్పుల రాయప్ప గారు పదవీ విరమణ అనంతర శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పరిపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషకరంగా గడపాలని JSPW సోదరులు మరియు శ్రేయోభిలాసులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.



