ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

అంకాళమ్మ వారికి విశేష పూజలు

📰 Generate e-Paper Clip

నంద్యాల జిల్లా శ్రీశైలం అక్టోబర్ 30( పొలిటికల్ పవర్ న్యూస్ )
లోకకల్యాణం కోసం శ్రీశైలక్షేత్ర గ్రామదేవత అయిన శ్రీ అంకాళమ్మవారికి అభిషేకం, విశేష పూజలను నిర్వహించడం జరిగింది.
ప్రతీ శుక్రవారం రోజున శ్రీఅంకాళమ్మవారికి దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ జరిపించబడుతోంది.
ఇందులో భాగంగా శ్రీఅంకాళమ్మవారికి అభిషేకం, విశేషఅర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరిపించబడ్డాయి.
కాగా శ్రీశైల క్షేత్రానికి గ్రామదేవతగా చెప్పబడుతున్న అంకాళమ్మ ఆలయం, ప్రధాన ఆలయానికి ఎదురుగాగల రహదారికి చివరలో కుడివైపున ఉత్తరముఖంగా ఉంది.
ప్రకృతి శక్తుల యొక్క కళలే గ్రామ దేవతలని దేవీభాగవతంలో చెప్పబడింది.
కాగా ఈ ప్రకృతి అంతా ఆదిపరాశక్తి స్వరూపమేనని మన ఆర్షవాజ్ఞ్మయం చెబుతోంది.
చతుర్భుజాలను కలిగిన ఈ దేవి నాలుగు చేతులలో కుడివైపున క్రింది నుండి పైకి వరుసగా కత్తి, సర్పంలో చుట్టబడిన డమరుకం ఉండగా, ఎడమవైపున పానపాత్ర, త్రిశూలం ఉన్నాయి. కిరీట మకుటం గల ఈ దేవి వస్త్రాలంకృతురాలైనా కర్ణాభరణాలను, కంఠాభరణాలను కలిగి ఉంటుంది.
కాగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజ జరిపించబడింది. ఆ తరువాత లోకకల్యాణాన్నికాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.
అనంతరం పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, జలముతో విశేషఅభిషేకం అర్చనలు నిర్వహించబడ్డాయి.

Latest Articles

రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి బెదిరింపులపై విచారణ జరపాలి

మహిళకు న్యాయం జరిగేవరకు పోరాటం మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా...

‘బియ్యం’ మాఫియా గుప్పిట్లో మార్కెట్‌!

‘ఎల్‌ నినో’ సాకుతో వ్యాపారుల సిండికేట్‌.. కృత్రిమ కొరత సృష్టించి కిలో రూ.82...

Related Articles

గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన నిలుపుదల చేయాలని, మౌలిక సమస్యలను పరిష్కరింపజేయాలని, ఎస్ సి ఆర్ రైల్వే అధికారికి వినతి పత్రం.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం : మహాబాబూబాద్ జిల్లా గార్ల మండల ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన ఎక్స్ప్రెస్...

రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి బెదిరింపులపై విచారణ జరపాలి

మహిళకు న్యాయం జరిగేవరకు పోరాటం మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్...
error: Content is protected !!