
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం :
మహాబాబూబాద్ జిల్లా గార్ల మండల
ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన ఎక్స్ప్రెస్ హాల్టింగ్ ఏర్పాటు చేయాలని,కోచ్ డిస్ప్లే ఏర్పాటు చేయాలని, ప్లాట్ఫారం అదనంగా పెంచాలని, రైల్వే స్టేషన్ లో వరండా హాలు, పర్మినెంట్ గా నిర్మాణం చేయాలని, పలు మౌలిక సమస్యలపై, పిసిసిఎం సౌత్ సెంటర్ రైల్వే అధికారి శ్రీమతి పద్మజా, మరియు పిసిఎంజి జోనల్ రైల్వే అధికారి, విజయ్, రైల్వే డి ఓ యం నరేంద్ర వర్మ, మరియు సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ రైల్వే అధికారులు సిబ్బంది తో డోర్నకల్ రైల్వే స్టేషన్ స్పెషల్ ట్రైన్లో విజిట్ చేయుటకు విచ్చేసిన సందర్భంగా రైల్వే డి ఆర్ సి యు కమిటీ మెంబర్ ఖాదర్ బాబా, గార్ల రైల్వే స్టేషన్ ప్యాసింజర్స్ కమిటీ ఆర్గనైజర్ కందునూరి ఈశ్వర్ లింగం, నాయకులు శివాజీ, రైల్వే విశ్రాంత ఉద్యోగస్తులు గుంటి శీను, తదితరులు పాల్గొని, వినతి పత్రం ఇచ్చి గార్ల సమస్యలపై వివరించడం జరిగింది.
గార్ల రైల్వే స్టేషన్ విషయాలపై రైల్వే అధికారుల అందరికీ అందరి దృష్టిలో ఉన్నది. కాబట్టి వీలున్నంతవరకు సమస్యల పరిష్కారం కొరకు సానుకూలంగా స్పందించి ఓపికతో విని గార్ల రైల్వే సమస్యలపై కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

