ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

‘బియ్యం’ మాఫియా గుప్పిట్లో మార్కెట్‌!

📰 Generate e-Paper Clip

‘ఎల్‌ నినో’ సాకుతో వ్యాపారుల సిండికేట్‌..

కృత్రిమ కొరత సృష్టించి కిలో రూ.82 వరకు విక్రయం.. 26 కేజీల బస్తాలో 1 నుండి 1.5 వరకు కేజీల వరకు తరుగు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ పరిశోధనాత్మక కథనం

రాష్ట్రంలో సామాన్యుల ప్రధాన ఆహారమైన బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, ‘ఎల్‌ నినో’ ప్రభావాన్ని సాకుగా చూపుతూ కొందరు బియ్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని గోదాముల్లో నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో బియ్యం ధరలు పెరిగి వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.

మండుతున్న ధరలు.. సామాన్యుడిపై భారం

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం కిలో ధర రూ.75 నుంచి రూ.82వరకు పలు రకాల బ్రాండ్లు పలుకుతోంది. 26 కేజీల సన్న బియ్యం బస్తా ధర రూ.19.50 నుంచి రూ.2,150 వరకు చేరింది. దీంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ తలకిందులవుతోంది. నిత్యావసరమైన బియ్యం ధరలు పెరుగుతుండటంతో కుటుంబ ఖర్చులను నిర్వహించడం కష్టంగా మారుతోంది.

తూకంలోనూ భారీ మోసాలా?

ఒకవైపు ధరల పెరుగుదల, మరోవైపు తూకంలోనూ మోసాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. 26 కేజీల బస్తా పేరుతో విక్రయిస్తున్న కొన్ని బస్తాల్లో 24.5 నుంచి 25 కేజీల బియ్యం మాత్రమే ఉంటున్నట్లు సమాచారం. అదే నిజమైతే ఒక్కో బస్తాపై వినియోగదారుడు 1 నుంచి 1.5 కేజీల బియ్యాన్ని నష్టపోవాల్సి వస్తుంది. ఈ వ్యవహారంపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, తూకంలో మోసాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

దొడ్డు బియ్యానికి పాలిష్‌.. సన్న బియ్యం పేరుతో విక్రయం!

బియ్యం వ్యాపారంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్‌ బియ్యాన్ని కొందరు మిల్లుల్లో అక్రమంగా రీసైక్లింగ్‌ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దొడ్డు బియ్యాన్ని యంత్రాల ద్వారా పాలిష్‌ చేసి, మెరుపు వచ్చేలా మార్చి, నాణ్యమైన సన్న బియ్యం పేరుతో కొత్త బ్రాండ్ల ద్వారా మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా మళ్లించి అధిక ధరలకు విక్రయిస్తేటి ప్రభుత్వ పంపిణీ వ్యవస్థకు నష్టం కలగడంతో పాటు వినియోగదారులు కూడా మోసపోయే ప్రమాదం ఉంది.

మార్కెట్లలో తనిఖీలు చేపట్టాలి

బియ్యం ధరల పెరుగుదల, కృత్రిమ కొరత, తూకంలో మోసాలు, రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. గోదాములు, రైస్‌ మిల్లులు, హోల్‌సేల్‌, రిటైల్‌ దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో తనిఖీలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. బియ్యం నిల్వలు, బస్తాల బరువు, విక్రయ ధరలను పరిశీలించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, సామాన్యులకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం అందేలా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Latest Articles

రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి బెదిరింపులపై విచారణ జరపాలి

మహిళకు న్యాయం జరిగేవరకు పోరాటం మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా...

అంకాళమ్మ వారికి విశేష పూజలు

నంద్యాల జిల్లా శ్రీశైలం అక్టోబర్ 30( పొలిటికల్ పవర్ న్యూస్ ) లోకకల్యాణం...

Related Articles

గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన నిలుపుదల చేయాలని, మౌలిక సమస్యలను పరిష్కరింపజేయాలని, ఎస్ సి ఆర్ రైల్వే అధికారికి వినతి పత్రం.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం : మహాబాబూబాద్ జిల్లా గార్ల మండల ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన ఎక్స్ప్రెస్...

రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి బెదిరింపులపై విచారణ జరపాలి

మహిళకు న్యాయం జరిగేవరకు పోరాటం మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్...
error: Content is protected !!