ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

అకాల వర్షంతో పత్తి రైతులకు అపార నష్టం..పత్తి తీయకముందే వర్షం

📰 Generate e-Paper Clip

పంట చేతికొచ్చే సమయంలో ఆర్నబ్ తుఫాన్ రైతులకు తీరని నష్టం..

జూలూరుపాడు అక్టోబర్28: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిన్9 తెలుగు న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో అకాల వర్షాలు పత్తి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మండల పరిధిలోని అధిక శాతం మంది రైతులు పత్తి, వరి, మిర్చి పంటలను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున పత్తి, మిర్చి పంటలను సాగు చేసిన రైతులకు అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.

పత్తి చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడంతో పత్తి తీయకముందే తడిసి నల్లబడుతోంది. దీంతో పత్తి నాణ్యత దెబ్బతినడంతో పాటు ఆశించిన ధర లభించకపోవచ్చని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతులు, అకాల వర్షాల కారణంగా నష్టాలు చవిచూడాల్సి వస్తోందని వాపోతున్నారు.

ప్రభుత్వం స్పందించాలి.. రైతులను ఆదుకోవాలి

అకాల వర్షాలతో నష్టపోతున్న పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రభావిత ప్రాంతాల జాబితాలో పరిగణనలోకి తీసుకోకపోవడంపై పలువురు రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Latest Articles

జూలూరుపాడులో ఘనంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు

జూలూరుపాడు లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...

జాతీయ పంచాయతీ అవార్డుకు నామినేట్ అయిన సీతంపేట బంజారా గ్రామ పంచాయతీని సందర్శించిన కేంద్ర బృందం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

మణిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో నూతన ఆర్వో ప్లాంట్ ప్రారంభం

సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ కృషితో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం...

శంభుని గూడెంలో మల్టీపర్పస్ వర్కర్స్ పై అదనపు భారం..పంచాయతీ నిధులు పక్కదారి పట్టిస్తున్న సర్పంచ్ శివ!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జైపూర్ లో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాళ్ళో రక్త దానం చేసిన...

Related Articles

ఫ్లాష్…ఫ్లాష్…ఫ్లాష్… అతి భయంకర కరువు రాబోతుంది. నీరు…విద్యుత్.. ఆహారం చాలా పొదుపుగా ఉపయోగిద్దాం…వృథా ను నివారిద్దాం.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.హైదరాబాద్ : ఎల్ నీ నో (కరువు)కాలంలో...

జూలూరుపాడులో ఘనంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు

జూలూరుపాడు లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. జూలూరుపాడు అక్టోబర్ 28: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్...

జాతీయ పంచాయతీ అవార్డుకు నామినేట్ అయిన సీతంపేట బంజారా గ్రామ పంచాయతీని సందర్శించిన కేంద్ర బృందం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్ సుజాతనగర్ మండలంలోని సీతంపేట బంజారా గ్రామ పంచాయతీ, “క్లీన్ అండ్...
error: Content is protected !!