ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

జాతీయ పంచాయతీ అవార్డుకు నామినేట్ అయిన సీతంపేట బంజారా గ్రామ పంచాయతీని సందర్శించిన కేంద్ర బృందం

📰 Generate e-Paper Clip


పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్
సుజాతనగర్ మండలంలోని సీతంపేట బంజారా గ్రామ పంచాయతీ, “క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ” (పరిశుభ్రత మరియు పచ్చదనం) విభాగంలో జాతీయ పంచాయతీ అవార్డుకు నామినేట్ అయింది.

ఈ నేపథ్యంలో, నేడు కేంద్ర బృందం గ్రామ పంచాయతీని సందర్శించి, పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల్లో గ్రామ పంచాయతీ చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతిని పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్థులతో బృందం ముఖాముఖి చర్చించి, అమలు చేస్తున్న పరిశుభ్రత మరియు పచ్చదనం కార్యక్రమాల వివరాలను, వాటి ప్రభావాన్ని తెలుసుకుంది. అదేవిధంగా, 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది.

ఈ కేంద్ర బృందంలో శ్రీ పినాకి తహబిల్దార్, కార్యదర్శి, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ (MoPR) మరియు శ్రీ సత్యజిత్ పాత్రో, కన్సల్టెంట్, SoEPR పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి *శ్రీమతి బి. అనూష* , కొత్తగూడెం డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీ కె. ప్రభాకర్, ఎంపీడీఓ శ్రీమతి బి. భారతి, ఎంపీఓ శ్రీ జె.ఎల్.జి. గాంధీ, గ్రామ సర్పంచ్ శ్రీ గూగులోత్ జానకిరామ్ మరియు పంచాయితీ కార్యదర్శి శ్రీ అజ్మీర నరసింహారావు మరియు ఇతర పంచాయతీ కార్యదర్శులు మరియు గ్రామా స్తులు పాల్గొన్నారు.

Latest Articles

జూలూరుపాడులో ఘనంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు

జూలూరుపాడు లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...

మణిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో నూతన ఆర్వో ప్లాంట్ ప్రారంభం

సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ కృషితో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం...

శంభుని గూడెంలో మల్టీపర్పస్ వర్కర్స్ పై అదనపు భారం..పంచాయతీ నిధులు పక్కదారి పట్టిస్తున్న సర్పంచ్ శివ!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జైపూర్ లో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాళ్ళో రక్త దానం చేసిన...

శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ట్రస్ట్ కేసును కొట్టివేసిన హైకోర్టు

 బ్రహ్మంగారిమఠం పొలిటికల్ పవర్9 టీవీతెలుగు ఏం, వెంకటేశ్వర్లు కడప (జిల్లా):- శ్రీ...

Related Articles

జూలూరుపాడులో ఘనంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు

జూలూరుపాడు లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. జూలూరుపాడు అక్టోబర్ 28: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్...

శంభుని గూడెంలో మల్టీపర్పస్ వర్కర్స్ పై అదనపు భారం..పంచాయతీ నిధులు పక్కదారి పట్టిస్తున్న సర్పంచ్ శివ!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ రిపోర్టర్ సత్యప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం శంభుని గూడెం గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్లుగా (MPW)...

శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ట్రస్ట్ కేసును కొట్టివేసిన హైకోర్టు

 బ్రహ్మంగారిమఠం పొలిటికల్ పవర్9 టీవీతెలుగు ఏం, వెంకటేశ్వర్లు కడప (జిల్లా):- శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వామి వారి...
error: Content is protected !!