పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 12 2026: బుధవారం అమావాస్య సందర్భంగా అచ్చుతాపురం గ్రామంలోని గుంటి పంచముఖి ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం గుంటి పంచముఖి ఆంజనేయస్వామి మూలమూర్తికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహ పూజలు నిర్వహించారు. గుంటి పంచముఖి ఆంజనేయస్వామి ఉత్సవమూర్తికి భక్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారికి పళ్లకు సేవ, మహా ప్రసాద వితరణ, మహా మంగళహారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి ఆశీర్వాదాలను అందించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని వనపర్తి వాస్తవ్యులు గంధం రాము, ధర్మపత్ని మనిషా నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ అధ్యక్షులు రమేష్ శర్మ, నవీన్ శర్మ, పూజారి రాజు గురుస్వామి, శాంతయ్య, సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ పసుపుల తిరుపతయ్య, మాజీ సర్పంచ్ శివకుమార్, ఉపసర్పంచ్ ఆశన్న నాయుడు, దేవాలయ వైస్ ప్రెసిడెంట్ రామస్వామి, ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా వివిధ ప్రాంతాలు, పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది.
