ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంఖమ్మం జిల్లా క్వారీ లారీ డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడిగా బండారి మధు

ఖమ్మం జిల్లా క్వారీ లారీ డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడిగా బండారి మధు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే. సతీష్ కుమార్ ఆగస్టు 13 2026: మ్మం జిల్లా క్వారీ లారీ డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడిగా బండారి మధు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం గ్రానైట్ మార్కర్ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన క్వారీ లారీ డ్రైవర్ల యూనియన్ పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఖమ్మం గ్రానైట్ మార్కర్ యూనియన్ గౌరవ సలహాదారు నరేంద్ర ఆదేశాల మేరకు, యూనియన్ అధ్యక్షుడు కిషన్ ఆధ్వర్యంలో ఖమ్మం గ్రానైట్ మార్కర్ యూనియన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నూతన అధ్యక్షుడిగా బండారి మధు, ఉపాధ్యక్షుడిగా కుంట శీను, కార్యదర్శిగా చింతల ఉపేందర్‌తో పాటు ఇతర పాలకవర్గ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ సలహాదారు నరేంద్ర మాట్లాడుతూ… క్వారీ లారీ డ్రైవర్ల యూనియన్ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. అధ్యక్షుడు కిషన్ మాట్లాడుతూ డ్రైవర్లకు ఎలాంటి సమస్య వచ్చినా తమ యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పాషా, మరో వైస్ ప్రెసిడెంట్ భద్రం, ట్రెజరర్ సైదులు, సెక్రటరీ జానీ, ట్రెజరర్-2 రామ్మూర్తి, జాయింట్ సెక్రటరీ నరసింహారావు, ఈసీ సభ్యులు వెంకటేశు, రమేష్, రఘు, గంగరాజు, నరహరి తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!