ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper

అజ్జకొల్లులో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

 

జై వాల్మీకి, జై శ్రీరామ్ నినాదాలతో బైక్ ర్యాలీ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామంలో ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామ యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు. జై వాల్మీకి, జై శ్రీరామ్ నినాదాలతో గ్రామ ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షుడు కావలి శ్రీనివాసులు మాట్లాడుతూ… అజ్జకొల్లులో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గ్రామ యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేశారని తెలిపారు. బోయవాడు రత్నాకరుడు తన తపస్సుతో మహర్షిగా మారి ప్రపంచానికి రామాయణ మహాకావ్యాన్ని అందించిన మహనీయుడు వాల్మీకి అని పేర్కొన్నారు. ఆయన జీవితం, బోధించిన ధర్మమార్గం నేటి యువతకు ఆదర్శమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విలువలను కాపాడేందుకు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తోకలి గోకర్, గుంటిపల్లి సవరయ్య, కావలి దశరథ, తోకల రవి, బడికిని విష్ణు శాంతమూర్తి, ఎద్దుల లక్ష్మన్న, మేస్త్రి రాములు, చైర్మన్ రాములు, సాయిబాబా, కావలి దశరథం, కావలి అశోక్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest Articles

ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమావేశం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక | పీఎన్9 తెలుగు...

ఉప్పాడ తీరంలో అలజడి..

ఎగసిపడుతున్న సముద్రపు అలలు! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

వాల్మీకి జయంతికి ఎమ్మెల్యే జారె ఆర్థిక చేయూత!

ఆలయ మరమ్మతులకు రూ.20 వేల సాయం.. తూర్పు బజార్‌లో ఘనంగా వాల్మీకి...

వినాయకపురంలో మట్టి తవ్వకాలపై విచారణ జరపాలి!

అనుమతులపై స్పష్టత ఏదీ? అక్రమ తవ్వకాల ఆరోపణలపై అధికారుల స్పందన ఏది? పొలిటికల్...

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎమ్మెల్యే మట్టా రాగమయి ఘన సన్మానం!

యువత భవిష్యత్తే లక్ష్యం.. సోషల్ మీడియాతో సామాజిక చైతన్యానికి పిలుపు! పొలిటికల్ పవర్...

అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి!

ఓటరు నమోదు కోసం ప్రభుత్వ కార్యాలయాల బాట పట్టిన అశ్వారావుపేట మండల...

Related Articles

ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమావేశం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక | పీఎన్9 తెలుగు న్యూస్ కాకటి సత్య ప్రకాష్, ప్రతినిధి టేకులపల్లి, నవంబర్ 27 2026: ఇల్లందు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో...

మోజర్ల లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు 

వాల్మీకి మహర్షి ఆశయాలు అందరికీ ఆదర్శం: సర్పంచ్ కె. చంద్రశేఖర్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026:...

మద్దిగట్లలో ఘనంగా ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ

వాల్మీకి విగ్రహ కార్యక్రమంలో పాల్గొన్న మొగిలి సత్య రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: పెద్దమందడి...
error: Content is protected !!