ePaper
Sunday, November 8, 2026
📄 ePaper

అద్వాని జీవితం భాజపా కార్యకర్తలకు ఆదర్శ వంగ ఉండాలి

📰 Generate e-Paper Clip

 – ఉమ్మడి  మహబూబ్ నగర్, జిల్లా బీజేపీ      ఉపాధ్యక్షులు కొమ్ము భరత్ భూషణ్,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 09.2026.భారత రత్న లాల్ కృష్ణ అద్వాని జీవితం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఆదర్శంగా నిలవాలని అద్వాని జీవితం భాజపా కార్యకర్తలకు ఆదర్శ వంగ ఉండాలి ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కొమ్ము భరత్ భూషణ్ అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో ఆయన నూరువ జన్మదినం సందర్భంగా పట్టణ చౌరస్తాలో ఆయన చిత్రపటం దగ్గర కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంలోఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కొమ్ము భరత్ భూషణ్ మాట్లాడుతూ 
1927 నవంబర్ 8 న జ్ఞాని దేవి కిషన్ అద్వాని పుణ్య దంపతులకు కారాచి లోని సింద్ పట్టణం లో మొదటి సంతానంగా జన్మించారు.1947 దేశ విభజన సందర్భం లో కారాచి లోని సొంత ఆస్తి, పాస్తులను వదలుకొని కట్టు బట్టలతో మహారాష్ట్రకు అద్వాని  కుటుంబం వచ్చి స్థిరపడ్డారని అన్నారు. ఉన్నత చదువులు చదువు తూనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ* కు పరిచయమై రాజస్థాన్ లోని అనేక జిల్లాలో ప్రచారక్ గా పనిచేశారు. గురూజీ కోరిక మేరకు భారతీయ జనసంఘ లో చేరారు. భారతీయ జనసంగ లో తదనంతరం భారతీయ జనతా పార్టీలో చురుకైన పాత్రను పోషించి, పార్టీని అధికారంలోకి తీసుకురావడం కొరకు అవిశ్రాంతంగా పనిచేశారు.
సోమనాథ్ నుండి అయోధ్య వరకు వారు చేపట్టిన రథయాత్ర భారతీయ జనతా పార్టీకి పెద్ద మలుపు తిరిగిందన్నారు.

అద్వానీ ఆయుష్షును పెంచిన ఈటీవీ సంస్థ

ఈ సందర్భంగా ఒక ముఖ్య సంఘటనను గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని,14-02-1998 ఎన్నికల ప్రచారంలో భాగంగా కోయంబత్తూర్ వెళ్లాల్సి ఉంది. కోయంబత్తూర్ బహిరంగ సభలో వారి షెడ్యూల్లో ఉన్నసమయానికే వారు అక్కడ ఉంటారని తెలిసి బిజెపి అంటే గిట్టని వారు బాంబు పేలుళ్లకు దిగారు. దాదాపు 58 మందికి పైగా మరణించారు.ఈనాడు దినపత్రిక వారు కొత్తగా ప్రారంభించిన ఈటీవీ కి ఇంటర్వ్యూ ఇవ్వడం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా కోయంబత్తూర్ కు చేరుకోవడం జరిగిందని, వారికి  ప్రమాదం తప్పింది. సభాస్థలి దగ్గరికి వెళ్ళవద్దని పోలీసు వారు ఎంత చెప్పినా క్షతగాత్రులను పరమార్శించ కుండా ఇక్కడి నుండి నేను వెళ్ళను. అని మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడం, వారికి ప్రగాఢ సానుభూతిని తెలపడం మరపురాని సంఘటన అని అన్నారు. 57 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎంతోమంది పార్టీ పెద్దలతో కలసి పనిచేసి,పార్టీని దేశంలో అగ్రస్థానంలో నిలిపిన ఘనత అద్వానీ గారిది.సంస్థాగత విషయాల్లో,సమస్యల పరిష్కార విషయం లో పార్టీ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీనీ, వాటిని వ్యక్తిగత సమస్యలుగా బావించకుండా, ఒకే ఆలోచనా విధానం తో పార్టీని ముందుకు తీసుకు పోయిన విషయం మనమందరం గుర్తుంచు కోవాలి. అదే దిశగా పనిచేయాలని,అద్వాని గారి 100 వ జన్మదినం సందర్బంగా, మన మందరం కార్యకర్తలము, నాయకులము ప్రతిన బూని వారి అడుగు జాడల్లో ప్రయనించి, పార్టీ నీ ఈ రాష్ట్రం లో అధికారం లోకి రావడానికి కృషి చేద్ధాం. కొత్తకోట లో జరిగిన కార్యక్రమం లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చెయ్యాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ ఉమ్మడి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు డాబా శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాములు యాదవ్, దామోదర్ రెడ్డి, సబి రెడ్డి వెంకట్ రెడ్డి, సత్యం సాగర్, రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Latest Articles

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.నవంబర్.09.2026.శ్రీ శ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.నవంబర్.09.2026.శ్రీ శ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం...

భక్తి శ్రద్ధలతో  శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.నవంబర్.09.2026.శ్రీ మహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం...

భక్తి శ్రద్ధలతో శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.నవంబర్.09.2026.శ్రీ శ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం...

అనంతారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లల్లో దీపావళి సంబరాలు నిర్వహించిన. సర్పంచ్ కొర్సా రమేష్

  జూలూరుపాడు నవంబర్ 08 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సందర్భంగా....

Related Articles

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.నవంబర్.09.2026.శ్రీ శ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానంద మలికిదేశిక...

పెద్దగూడెం గ్రామాన్ని అన్ని విధాల ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

35 మంది నిరుపేదలకు ఇందిరమ్మ కాలనీ పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా...

పండ్ల వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

పాత గంజిలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదేశాలు రోడ్డు వెడల్పు అనంతరం అదే ప్రాంతంలో శాశ్వత దుకాణాలు ఏర్పాటు చేస్తాం వ్యాపారులకు ఎమ్మెల్యే భరోసా పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...
error: Content is protected !!