ePaper
Sunday, November 8, 2026
📄 ePaper

పండ్ల వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

పాత గంజిలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు

మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదేశాలు

రోడ్డు వెడల్పు అనంతరం అదే ప్రాంతంలో శాశ్వత దుకాణాలు ఏర్పాటు చేస్తాం

వ్యాపారులకు ఎమ్మెల్యే భరోసా

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 08 2026: వనపర్తి పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా డిపో రోడ్డులో వ్యాపారాలు నిర్వహిస్తున్న పండ్ల వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు, ఆర్థిక నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని పండ్ల వ్యాపారులతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో వ్యాపారులు ఉపాధి కోల్పోకుండా వనపర్తి పాత మార్కెట్ యార్డు (పాత గంజి)లో తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేసి దుకాణాలు నిర్వహించుకునేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రోడ్డు విస్తరణ కారణంగా పండ్ల వ్యాపారులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాత్కాలికంగా పాత గంజిలో దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు కొనసాగించుకునే అవకాశం కల్పిస్తామని, రోడ్డు విస్తరణ పనులు పూర్తయిన అనంతరం ప్రస్తుతం వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రాంతంలోనే శాశ్వత దుకాణాలు ఏర్పాటు చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల సమయంలో వ్యాపారుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం, మున్సిపల్ యంత్రాంగం సమన్వయంతో చర్యలు తీసుకుంటాయని తెలిపారు. పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరం వనపర్తి పట్టణంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా రహదారుల విస్తరణ ఎంతో అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మెరుగైన రహదారులు, సులభమైన రవాణా సౌకర్యాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం పట్టణ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. పట్టణ అభివృద్ధి అనేది ఒక్కరి బాధ్యత కాదని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని పేర్కొంటూ రోడ్డు విస్తరణకు వ్యాపారులు, స్థానిక ప్రజలు సానుకూలంగా సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనులతో పాటు చిరు వ్యాపారుల ఉపాధి, ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య జర్నల్ సెక్రెటరీ బ్రహ్మంచారి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఏర్పుల రవి యాదవ్, క్రాంతి గౌడ్, యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, NSUI అధ్యక్షులు శ్రీకాంత్, రఘు యాదవ్, పాల రవి, నక్క రాములు, చుక్క రాజు, బి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

Latest Articles

బార్ అండ్ రెస్టారెంట్ సమస్యలు పరిష్కరించాలి

పెంచిన ప్రివిలేజ్ పన్నును వెంటనే రద్దుచేయాలి ఎక్సైజ్ కమిషనర్ తీరుతో ప్రభుత్వం అప్రతిష్టపాలు ప్రివిలేజ్...

పెద్దగూడెం గ్రామాన్ని అన్ని విధాల ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

35 మంది నిరుపేదలకు ఇందిరమ్మ కాలనీ పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే...

తిరుమలయ్య గుట్టను సుందర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

రూ.2 కోట్లతో సమగ్ర అభివృద్ధి పనులు.. రహదారి, తాగునీరు, హరిత హోటల్‌తో పాటు...

జనసేన ఎమ్మెల్యేకు బిగ్ షాక్: బత్తుల రామకృష్ణ భార్యపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు ఘన విజయం!

 సీతానగరం/తూర్పుగోదావరి:పొలిటికల్ పవర్ ప్రతినిధితూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది....

Related Articles

తిరుమలయ్య గుట్టను సుందర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

రూ.2 కోట్లతో సమగ్ర అభివృద్ధి పనులు.. రహదారి, తాగునీరు, హరిత హోటల్‌తో పాటు పర్యాటకులకు ఆధునిక వసతులు అభివృద్ధి పనులతో ఆధ్యాత్మికతకు పర్యాటక శోభ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

బార్ అండ్ రెస్టారెంట్ సమస్యలు పరిష్కరించాలి

–పెంచినప్రివిలేజ్,పన్నునువెంటనేరద్దుచేయాలి,ఎక్సైజ్ కమిషనర్ తీరుతో ప్రభుత్వం అప్రతిష్టపాలు,ప్రివిలేజ్ పెంపుతో లక్షల మందికి ఉపాధి కరువై రోడ్డున పడే ప్రమాదం,–  బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యుగంధర్ రెడ్డికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శ

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు.. బాధితుడికి అండగా నిలిచిన మాజీ మంత్రి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్...
error: Content is protected !!