అధ్యక్షుడిగా సరిదే రాజశేఖర్.. ఉపాధ్యక్షుడిగా
తనగల శివశంకర్ ఏకగ్రీవ ఎన్నిక!
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ వడితే గణేష్ అక్టోబర్ 13 2026: అశ్వారావుపేట లో పాత్రికేయుల ఐక్యతకు పునాది.. ప్రజా సమస్యలపై పోరాటానికి కొత్త వేదిక! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ‘నేతాజీ ప్రెస్ క్లబ్’ నూతనంగా ఏర్పాటైంది. సోమవారం నిర్వహించిన సమావేశంలో సభ్యులందరూ కలిసి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం. క్లబ్ అధ్యక్షుడిగా సరిదే రాజశేఖర్, ఉపాధ్యక్షుడిగా తనగల శివశంకర్, కార్యదర్శిగా షేక్ అబ్బాస్, ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి ప్రెస్ క్లబ్ వేదికగా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు, అధికార యంత్రాంగానికి మధ్య వారధిగా నిలుస్తూ స్థానిక సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. పాత్రికేయుల మధ్య పరస్పర సహకారం, ఐక్యతను బలోపేతం చేస్తూ ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తామని నూతన కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.
జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం!:
నూతనంగా ఏర్పాటైన నేతాజీ ప్రెస్ క్లబ్ పాత్రికేయుల ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు, జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యవర్గ సభ్యులు తెలిపారు. ప్రజల గొంతుకగా నిలుస్తూ, స్థానిక సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు.
నిజాన్ని నిర్భయంగా వెలికితీస్తూ.. ప్రజా గొంతుకగా నిలుస్తాం! :
పాత్రికేయ విలువలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా క్లబ్ ముందుకు సాగుతుందని నూతన కార్యవర్గ సభ్యులు స్పష్టం చేశారు.
నూతన కార్యవర్గానికి అభినందనల వెల్లువ:
నేతాజీ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంగా ఎన్నికైన సరిదే రాజశేఖర్, తనగల శివశంకర్, షేక్ అబ్బాస్, కు స్థానిక ప్రముఖులు, వివిధ రంగాల నాయకులు, తోటి పాత్రికేయులు శుభాకాంక్షలు తెలిపారు. క్లబ్ జర్నలిస్టుల అభ్యున్నతికి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికగా ఎదగాలని ఆకాంక్షించారు.


