ప్రజలకు భరోసా.. నేరగాళ్లకు సింహస్వప్నం కావాలనే ఆశలు!
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే కీలకం
తప్పు చేసేటోళ్లకు చట్టం సెగ తగలాలె.. అశ్వారావుపేట ఎస్‌హెచ్‌ఓగా సాయికిషోర్ రెడ్డి ఎంట్రీ
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ అక్టోబర్ 16 2026: అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)గా సాయికిషోర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతన అధికారిగా ఆయన బాధ్యతలు చేపట్టడంతో పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై చర్చ మొదలైంది. ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్.. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు.. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ వంటి అంశాల్లో నూతన ఎస్‌హెచ్‌ఓ తనదైన కార్యాచరణతో ముందుకు సాగాలని ప్రజలు ఆశిస్తున్నారు.
నేరాల నియంత్రణ.. ప్రజల భద్రతకు పెద్దపీట:
పోలీసుల విధుల్లో ప్రజలకు భద్రత కల్పించడం, బాధితుల ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో నూతన ఎస్‌హెచ్‌ఓ సాయికిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సేవలు మరింత సమర్థవంతంగా సాగాలని ప్రజలు ఆశిస్తున్నారు.
ప్రజల నమ్మకమే పోలీసుల విజయానికి పునాది:
పోలీసులు ప్రజలకు మరింత చేరువై, వారి సమస్యలకు స్పందించినప్పుడే పోలీస్ వ్యవస్థపై నమ్మకం బలపడుతుంది. నూతన ఎస్‌హెచ్‌ఓ సాయికిషోర్ రెడ్డి తన విధుల ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొని, అశ్వారావుపేటలో భద్రతా వాతావరణాన్ని మరింత బలోపేతం చేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.


